శ్వాస ఉన్నంతవరకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్వాస ఆగే వరకూ పని చేస్తూ ఉండటమే నాకు ఇష్టం -అంటున్నాడు సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు. సినిమాటోగ్రాఫర్‌గా ఎనే్నళ్ల అనుభవమున్నా -హారర్ జోనర్‌లో మాత్రం దర్శకుడు ఓంకార్‌కంటే జూనియర్‌నేనని చమత్కరించాడు. యాక్షన్, లవ్ జోనర్ సినిమాలు ఇష్టపడే చోటా తొలిసారి హారర్ జోనర్‌లో చేసిన సినిమా రాజుగారి గది 3. సినిమాటోగ్రాఫర్‌గా తొలి సినిమాలు అమ్మ రాజీనామా, రగులుతున్న భారతం చేసినపుడు ఎంత తపన పడ్డానో అలాంటి ఫీలింగే మళ్లీ ఈ సినిమాతో కలిగిందంటున్నాడు చోటా.
టీవీ యాంకర్ నుంచి దర్శకుడైన ఓంకార్ నుంచి వస్తోన్న తాజా సీక్వెల్ -రాజుగారి గది 3. అవికాగోర్, అశ్విన్ బాబు హీరో హీరోయిన్లు. రాజుగారి గదికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా అక్టోబర్ 18న థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా డీవోపీ చోటా కె నాయుడుతో ఇంటర్వ్యూ.
టీవీ యాంకర్‌గా ఉన్నప్పటి నుంచీ ఓంకార్‌తో నాకు హెల్దీ రిలేషన్ ఉంది. తొలి కలయికలో ఏర్పడిన హృద్యమైన ఆ పరిచయం -ఇప్పటికీ కొనసాగుతుంది.
ఫస్ట్‌టైం ‘జీనియస్’ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చాడు. కథ అద్భుతంగా చెప్పాడు. కాకపోతే కలిసి పనిచేసే టైమ్ సెట్ కాలేదు. తరువాత రాజుగారి గది చిత్రానికీ అనుకున్నాం. కుదరలేదు. ఈసారి రాజుగారి గది 3 అతనితో కలిసి వర్క్ చేశా.
హారర్ ప్రాజెక్టు అన్నపుడు కొంచెం సంకోచించా. కాకపోతే.. ‘ఇది పూర్తిగా హారర్ అనలేం. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గానే డిజైన్ చేశా’నని ఓంకార్ చెప్పడం, చాలాకాలంగా కలిసి పనిచేయాలన్న ఆలోచన.. ఇక తప్పలేదు.
ప్రాజెక్టుకు అశ్విన్ హీరో అన్నపుడు -నాలో డౌట్ రైజైంది. చేయగలడా? అన్న సందేహాలు ముసిరాయి. బట్, ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అశ్వినే పెద్ద సర్‌ప్రైజ్ అయ్యాడు. అటు ఎమోషన్, ఇటు యాక్షన్.. ఇంకోపక్క సాంగ్స్.. ఏదైనా సింగిల్ టేక్‌లో చేసేశాడు. సినిమా మొత్తానికి అశ్విన్ ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్.
హీరోయిన్‌గా ఫస్ట్ చాలా పేర్లు వినిపించినా -చివరకు అవిగా గోర్ అన్నపుడూ.. అవే డౌట్స్. సినిమా పూరె్తైంది. ఆమెకు ఇప్పుడు నేను ఫ్యాన్. అదీ ఆమె స్టామినా. క్లైమాక్స్‌లో అవికా పెర్ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేం. ప్రొడక్షన్ హౌస్‌కి వెరీ హంబుల్ ఆర్టిస్ట్. అంతెందుకు.. ఓంకార్ ఎంపిక చేసుకున్న వాళ్లంతా గ్రేట్ పెర్ఫార్మర్స్.
సినిమాలో ఎక్కువ భావం నైట్ షూటే. చాలాకాలం తరువాత ఈ సినిమా కోసం -రోజుకు పదహారు గంటలు పని చేయాక తప్పలేదు. కాకపోతే -అవన్నీ హ్యాపీ నైట్స్.
ఎంత అనుభవమున్న సినిమాటోగ్రాఫర్‌నైనా -సినిమా హిటు ఫట్టులు చెప్పలేడు. ఏదైనా ఆడియనే్స డిసైడ్ చేస్తారు. బట్, రాజుగారి గది 3 ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తుందని మాత్రం చెప్పగలను.
చాలాకాలంగా ప్రొఫెషన్‌లో ఉన్నా -ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నా. కొత్తవాళ్లతో పని చేయడానికి ఆసక్తి చూపించటమే అప్‌డేట్ అవుతుండటం. కొత్త కుర్రాళ్లు గొప్ప ఎక్స్‌పీరియన్స్ చూపిస్తే.. వాళ్లను మెచ్చుకోవడం కాదు, సరెండరై పోతా. అది నా అలవాటు.
సినిమాటోగ్రాఫర్‌గా సీనియర్‌నేగానీ, డైరెక్షన్ అంత కాదు. పైగా నాకున్న ప్రస్తుత టెంపర్‌మెంట్‌కు అది సూటయ్యే వింగ్ కూడా కాదు. పూర్తిగా వయసుడిగిన తరువాత డైరెక్షన్ గురించి ఆలోచిస్తానేమో (నవ్వుతూ).
సంపాదించామా.. తిన్నామా.. పడుకున్నామా? అన్న ఆలోచనలు నాకు సూటవ్వవు. చివరి శ్వాస వరకూ పని చేస్తూ ఉండాలన్నది నా తపన. అందుకు నాకు చాలామందే ఆదర్శంగా ఉన్నారు.
తరువాతి ప్రాజెక్టులంటూ నా చేతిలో ఏమీ లేవు. ఏం ఉంటాయో ఇప్పుడే చెప్పలేను కూడా. వచ్చినపుడు తప్పకుండా చెబుతా.

-ప్రవవి