ఈ హారర్ ఓ స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటి వరకూ చాలా భాషల్లో చాలా చాలా హారర్ సినిమాలు వచ్చి ఉండొచ్చు. కానీ -రాజుగారి గది 3 మాత్రం వాటన్నిటికీ భిన్నమైనది అంటోంది హీరోయిన్ అవికా గోర్.
టీవీ యాంకర్ నుంచి దర్శకుడైన ఓంకార్ నుంచి వస్తోన్న తాజా సీక్వెల్ -రాజుగారి గది 3. అవికాగోర్, అశ్విన్ బాబు హీరో హీరోయిన్లు. రాజుగారి గదికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా అక్టోబర్ 18న థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా హీరోయన్ అవికా గోర్ మీడియాతో మాట్లాడింది.
ట్రైలర్‌లో భయపెట్టే పాత్రలాగే కనిపించినా -సినిమాలో మాత్రం గాళ్ నెక్స్ట్ డోర్ అన్నట్టు కేరళ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, కాకపోతే ఎందుకు అలా అందరినీ భయపెడుతున్నానన్నదే ఆసక్తికరమైన కథనమని ఆమె పేర్కొంది. ‘నిజానికి హారర్ సినిమాలంటే నాకు చాలా భయం. కుటుంబ సభ్యులో, స్నేహితులో తోడు లేకుండా హారర్ సినిమాలు చూడను. అలాంటి హారర్ సినిమాలో చేయడం చిత్రమైన అనుభూతికి గురయ్యాను’ అని చెప్పుకొచ్చింది. రాజుగారి గది 3 సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే -సినిమాలో హారర్ సీన్స్‌కి ఎంత భయపడతామో, అంతే నవ్వేస్తుంటాం. అందుకే హారర్ కామెడీ అనేది. పైగా సినిమాలో ఫెమిలియర్ కమెడియన్స్ ఉన్నారు. ఎక్స్‌పర్ట్ టెక్నీషియన్స్ పని చేశారు. సో, కచ్చితంగా ఆడియన్స్‌ది ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని పేర్కొంది. ఫస్ట్‌టైం హారర్ మేకప్ అయిన తరువాత అద్దంలో నన్ను నేను చూసుకుని రెండు రోజులు నిద్రపోలేదు. పాత్ర చేసిన నాకే అలావుంటే, ఆడియన్స్ ఎలా ఫీలవుతారో ఊహించండి అంటోంది అవికా గోర్. తను చేసిన పాత్రపై ఎవరి ప్రభావం లేదని చెబుతూ.. -ఏ పాత్రయినా దర్శకుడి సృష్టి. ఏ నటి అయినా దర్శకుడి ఆలోచనను పాత్రగా ప్రతిబింబించేందుకే ప్రయత్నిస్తుంది అని సమాధానమిచ్చింది. హారర్ క్యారెక్టర్ కోసం బాడీ లాంగ్వేజ్‌పై ఒకింత దృష్టి పెట్టాను తప్ప, ప్రత్యేకంగా ఎలాంటి రిహార్సల్స్ చేయలేదని చెప్పింది. కెరీర్‌పరంగా టీవీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోన్న అవిక, సమయాన్ని బట్టి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది.