బంధాలను గుర్తుచేసేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెనె్నల కిషోర్, హర్షిత ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా -తోలుబొమ్మలాట. విశ్వనాథ్ మాగంటి దర్శకుడు. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మాత. నవంబర్‌లో సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న తరుణంలో రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ -42ఏళ్ల నట జీవితంలో టాప్ ఫైవ్ సినిమాలో తొలుబొమ్మలాట ఒకటి ఉంటుంది. మానవ సంబంధాలు, జీవితంలో స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇది. ఇలాంటి కథను అనుభవజ్ఞుడు చెప్పాలి. కాని, ఓ కుర్ర దర్శకుడు కథ చెప్పడం నాకే ఆశ్చర్యమేసింది. ఆ నలుగురు తరువాత మళ్లీ నన్ను హెచ్చరించిన కథ ఇది. నా నట జీవితంలో మరపురాని సినిమా -తోలుబొమ్మలాట అన్నారు. దర్శకుడు విశ్వనాథ్ మాట్లాడుతూ -కథను రాసుకున్న తరువాత రాజేంద్రప్రసాద్‌కు నెరేట్ చేసినపుడు చాలా ప్రోత్సహించారు. కథను నడిపించే సోడాలరాజుగా ఆయన కనిపిస్తారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పూరె్తైంది. నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం అన్నారు. హీరో విశ్వంత్ మాట్లాడుతూ -కేరింత సినిమాతో దర్శకుడు విశ్వనాథ్‌తో నా జర్నీ మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రమిది అన్నారు. సీనియర్ నటుడు నారాయణరావు మాట్లాడుతూ -సినిమాలో సోడాలరాజు స్నేహితుడిగా కనిపిస్తా. స్నేహానికి అర్థం చెప్పే అద్భుతమైన కథ అన్నారు. కార్యక్రమంలో హర్షితాచౌదరి, నర్రా శ్రీనివాస్, దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామన్ సతీష్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు.