పండగ రేస్‌కి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే సంక్రాంతికి సినిమా ఫైట్ సిద్ధమైపోయింది. ప్రత్యేకతలు కలిగిన ప్రాజెక్టులతో ఇటు బన్నీ, అటు మహేష్ -జనవరి 12న బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించుకున్నారు. హ్యాట్రిక్ సక్సెస్‌ను అల్లు అర్జున్ -త్రివిక్రమ్ టార్గెట్ చేస్తే.. తొలిసారి జవాన్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి ఇటు మహేష్ -అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారు. బన్నీ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, మహేష్ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తుండటం యాధృచ్చికం.
బన్నీతో రెండోసారి రొమాన్స్‌లో పూజా హెగ్దె, మహేష్‌తో తొలిసారి రొమాన్స్‌లో యంగ్ సెనే్సషన్ రష్మిక మండన్న కెమిస్ట్రీని పండించేందుకు కష్టపడుతున్నారు. నాపేరు సూర్య భారీ వైఫల్యం తరువాత గ్యాప్ తీసుకున్న బన్నీ -ఆచితూచి కథను, దర్శకుడు త్రివిక్రమ్‌ను ఎంచుకోవడం తెలిసిందే. మహర్షి హిట్టుతో మరో మెట్టెక్కిన మహేష్ -తొలిసారి జవాన్ క్యారెక్టర్‌ని, సక్సెస్‌ఫుల్ యంగ్ డైరెక్టర్‌ని ఎంచుకున్నాడు. రెండు చిత్రాలకూ పెద్ద నిర్మాతలు, భారీ తారాగణం, భారీ సాంకేతిక వర్గం పని చేస్తుండటంతో -పెద్ద పండక్కి వినోదమే వినోదమంటూ ఆడియన్స్‌లో అప్పుడే ఆసక్తి మొదలైంది.
బన్నీ.. అల
హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం -అల వైకుంఠపురములో. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సిద్ధమవుతోన్న సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 12న థియేటర్లకు వస్తున్నట్టు అల.. చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ కావడంతో సహజంగానే సినిమాపై భారీ అంచనాలున్నాయి. బన్నీతో పూజా హెగ్దె రెండోసారి జోడీ కడుతుంటే, సీనియర్ హీరోయిన్ టబు ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాణమవుతోన్న చిత్రం విడుదల తేదీని కొత్త పోస్టర్‌పై ప్రకటించారు. చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘సామజవరగమన’, దసరా సందర్భంగా విడుదలైన ప్రచార చిత్రాలు మరింత ఆసక్తిని రెకెత్తించాయి. విడుదల తేదీ ఖరారైపోవడంతో -శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై ఓ పాటను చిత్రీకరిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. చిత్రంలో రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ల భరణి, మురళీశర్మ, నటరాజన్, రోహిణి, ఈశ్వరీరావు, బ్రహ్మాజీ, హర్షవర్థన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఎస్‌ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ సమకూరుస్తున్నారు.
మహేష్.. సరిలేరు
మహేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం -సరిలేరు నీకెవ్వరు. క్యాచీ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమా దిల్‌రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. షార్ట్‌టైమ్ సెనే్సషన్ రష్మిక మండన్న తొలిసారి హీరో మహేష్‌తో జోడీ కడుతోంది. ప్రత్యేక పాత్రలో సీనియర్ నటి విజయశాంతి నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాను జనవరి 12న థియేటర్లకు తేనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీపై మహేష్ స్పందిస్తూ -ఈ సంక్రాంతి నాకు బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ స్పెషల్ అంటున్నాడు. సమర్పకుడు దిల్‌రాజు, నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ -సరిలేరు నీకెవ్వరు మీ హృదయాలను గెలుచుకుని నవ్వులు పూయిస్తుంది. యాక్షన్‌తో మిళితమైన హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రామిస్ చేస్తున్నాం అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ -వచ్చే సంక్రాంతి రోజున నవ్వకుండా, చప్పట్లు కొట్టకుండా, ఈలలతో గోల చేయకుండా ఉండలేరు అన్నాడు. హీరోయిన్ రష్మిక స్పందిస్తూ -క్యాలెండర్‌లో డేట్ మార్క్ చేసుకోండి. జనవరి 12న కలుద్దాం అంటూ కామెంట్ చేసింది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.