ఇష్క్.. రిస్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ 2 మనసులు చిత్రంతో నిర్మాతగా మారిన వ్యాపారవేత్త ఎస్ చంద్రశేఖర్ -మరో సినిమాకీ శ్రీకారం చుట్టారు. జెయస్సార్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న చిత్రం -ఇష్క్ ఈజ్ రిస్క్. రవిచంద్ర, యుగా యుగేష్, సాయిశ్రీవి హీరో హీరోయిన్లు. రాజ్‌కింగ్ దర్శకుడు. జీవా, చమ్మక్‌చంద్ర, తాగుబోతు రమేష్, నల్ల వేణు, బండ రఘు, మాధవి, జబర్దస్త్ పవన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం ఆడియో విడుదలైంది. చిత్ర నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ -సినిమా కోసం మా టీమ్ చాలా కష్టపడింది అన్నది నిర్మాతకు అలవాటైన మాట. అయితే ఈ సినిమా చూసి ఎవరెంత కష్టపడ్డారన్నది ఆడియనే్స చెప్పాలి. ఈ ఆడియో కార్యక్రమం చూశాక -తప్పక సినిమాకు ఆదరణ లభిస్తుందన్న నమ్మకం కలుగుతోంది అన్నారు. నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ -సినిమా నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ -దర్శకుడి ప్రతిభ తెలియాలంటే సరైన నిర్మాత దొరకాలి. అలా సరైన దర్శకుడికి సరైన నిర్మాత కుదిరి వస్తోన్న సినిమా -ఇష్క్ ఈజ్ రిస్క్. ట్రైలర్ బాగుంది. హీరోలో ఈజ్‌వుంది. సినిమా సక్సెస్ ఖాయం అన్నారు. హీరో రవిచంద్ర మాట్లాడుతూ -ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ. దర్శకుడు రాజ్‌కింగ్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు అన్నారు. దర్శకుడు రాజ్‌కింగ్ మాట్లాడుతూ -ఇష్క్ ఈజ్ రిస్క్ లాంటి చిత్రంతో దర్శకుడిగా నన్ను లాంచ్ చేస్తున్న నిర్మాతకు ధన్యవాదాలు. హాస్యానికి పెద్దపీట వేస్తూ రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ ఇది. మంచి టీమ్‌తో మంచి అవుట్‌పుట్ తీస్తున్నాం, అందరికీ నచ్చుతుంది అన్నారు.