ఇఎమ్‌ఐ.. ఈ అమ్మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భానుశ్రీ, నోయల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం -ఈఎంఐ. శ్రీ అవధూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్‌లో దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడిలు నిర్మిస్తోన్న చిత్రాన్ని దర్శకుడు దొంతు రమేష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ అమ్మాయి అనే అర్థం వచ్చేలాంటి టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణగౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ -నా బర్త్‌డేన ఇఎమ్‌ఐ ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ అవడం హ్యాపీగా ఉంది. కష్టపడి సినిమా చేసాం. చిత్ర దర్శకుడు రమేష్‌కు నిర్మాత బుచ్చయ్య తండ్రి కావడంతో సినిమా సాఫీగా సాగిపోతోంది. కొన్ని ప్యాచ్ వర్కులతోపాటు సాంగ్స్ మిగిలిఉన్నాయి. స్టోరీ లైన్ నచ్చి ప్రాజెక్ట్ చేస్తున్నా. ఇదొక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అన్నారు. ఇఎమ్‌ఐల కారణంగా మహిళలు ఎలా స్ట్రగులవుతున్నారన్న విషయాన్ని తెలిపే కథ. సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ -ఇఎమ్‌ఐ సౌండింగ్ చూస్తే ఈ అమ్మాయి అని వస్తుంది. అదే సినిమా టైటిల్ కూడా. ఫస్ట్‌లుక్, పోస్టర్ చూస్తే సినిమాలో స్ట్ఫ్ ఏమిటో అర్థమవుతోంది. ఓ మంచి సినిమా క్రెడిట్ నిర్మాత బుచ్చయ్య, దర్శకుడు రమేష్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులకే దక్కుతుంది అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ -గ్లామర్ హీరోయిన్‌తో సినిమా చేశారు. యూత్‌ను అట్రాక్ట్‌చేసే పోస్టర్లుంటేనే ఓపెనింగ్స్ బావుంటాయి. తరువాత కంటెంట్ బాగుంటే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారు. సినిమా అందరికీ కనెక్టవుతుందనే అనుకుంటున్నా అన్నారు. దర్శకుడు రమేష్ మాట్లాడుతూ -నిర్మాతల సహకారంతో టాకీపార్ట్ పూర్తి చేసి ఇక్కడి వరకూ వచ్చాం. కొన్ని సాంగ్స్ బ్యాంకాక్‌లో షూట్ చేయాల్సి ఉంది. అవి త్వరలోనే పూర్తిచేస్తాం. సినిమా చూశాక ఎవరైనా బోర్ ఫీలైతే, వాళ్ల ఒకనెల ఇఎంఐ నేను కడతాను. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా అన్నారు. నిర్మాత బుచ్చయ్య మాట్లాడుతూ -కొడుకుని దర్శకుడుగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. మంచి సబ్జెక్టు. కొత్తగా ఉంటుంది. అందరికీ కనెక్టవుతుందని నమ్మకం. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం అన్నారు. శ్రీసంధ్, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.