ట్రంప్ వ్యాఖ్యలు అసమంజసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన బాలీవుడ్ తార ప్రియాంకచోప్రా అమెరికాలో మంగళవారం రాత్రి జరిగిన ‘టైమ్100 గాలా’లో తళుక్కుమన్నారు. ప్రఖ్యాత టిస్డూడియో డిజైనర్ ఒల్కెగుల్‌సిన్ రూపొందించిన తెల్లని పాంట్‌సూట్‌లో తళతళలాడిన ప్రియాంక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు పార్టీ సహచరులతో తలపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ట్రంప్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె వ్యతిరేకించారు. ఒక మతానికి చెందినవారిని దేశం నుంచి నిషేధించాలన్న ఆయన వ్యాఖ్యలు సరికావని, ఎవరో కొంతమంది చేసిన తప్పులకు ఓ జాతిని నిషేధించాలనుకోవడం తప్పుని, అది సాధ్యం కాదని ఆమె అన్నారు. అయితే ప్రపంచానికి తీవ్రవాదం పెద్ద సమస్యేనని, దానికి ట్రంప్ చేసిన సూచన సమాధానం కాదని ప్రియాంక వ్యాఖ్యానించారు. టైమ్100 గాలా కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ తన సతీమణితో కలసి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. అమెరికాలో జనాదరణ పొందిన టీవీ సీరియల్ ‘క్వాంటికొ’లో మెప్పించిన ప్రియాంక ‘బేవాచ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.