నాగ్‌తో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగులోకి పరిచయమై టాప్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్కకి నాగార్జున సినిమాల్లో చేయడం అంటే చాలా ఆసక్తి. కారణం తను ఈ స్థాయిలో ఉండడానికి ఆయనే కారణమని చెబుతూంటుంది. కాబట్టి ఆయన సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడల్లా నటించేందుకు సిద్ధమంటోంది అనుష్క. ఇప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ సినిమాల్లో గెస్ట్ రోల్‌లో కనిపించిన అనుష్క మరోసారి ఆయన సినిమాలో నటించేందుకు సిద్ధమైందట. నాగార్జున హీరోగా తెరకెక్కే హాథీరామ్‌బాబా జీవిత కథతో రూపొందే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో అనుష్క ఓ కీలక పాత్రలో కనిపిస్తుందట. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రగ్యాజైస్వాల్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. మరి ఈ చిత్రంలో అనుష్క పాత్ర ఎలా వుంటుందో చూడాలి!