కదిలొచ్చిన బురుజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోల సినిమాల కోసం -కొండమీది కోతినైనా దించుతున్నారు నిర్మాతలు. అలాంటిది బురుజేపాటిది. అందుకే -కర్నూలులో ఉండాల్సిన కొండారెడ్డి బురుజు హైదరాబాద్‌లో ఆవిష్కృతమైంది. మహేష్‌బాబు చేస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఆ చిత్రబృందం ఓ అద్భుతానే్న ఆవిష్కరించింది. కర్నూలు కొండారెడ్డి బురుజుని మరిపించేలా -హైదరాబాద్‌లో సెట్ వేసేశారు. ఆ సెట్ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ‘16 ఏళ్లక్రితం కొండారెడ్డి బురుజు వెండితెరపై ఐకానిక్ లొకేషనైంది. ఈసారి దీన్ని మరింత పెద్దది చేశాం. ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాశ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కొండారెడ్డి బురుజుని హైదరాబాద్‌కు తెచ్చారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సెట్‌ముందు సూపర్‌స్టార్ మహేష్ నిలబడి ఉండే ఫొటోను షేర్ చేశారు. మహేష్ -అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా -సరిలేరు నీకెవ్వరు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదలకానుంది.