కమర్షియల్‌కు ఓకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్ఫార్మెన్స్ ఆర్టిస్టుగా కన్నడ చిత్రసీమలో మంచి పేరొచ్చింది. -ఇకపై కమర్షియల్ చిత్రాల్లో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నా అంటోంది సుకృత వాగ్లే. ఇంద్ర, సుకృత వాగ్లే హీరో హీరోయిన్లుగా దర్శకుడు శ్రీహర్ష మండ తెరకెక్కించిన చిత్రం -రామ చక్కని సీత. జిఎల్ ఫణికాంత్ నిర్మాత. కొత్తవాళ్లతో రూపుదిద్దుకున్న సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం సుకృత వాగ్లే మీడియాతో మాట్లాడింది.
మాది ఉడిపి. కొంకిణి అమ్మాయిని. బిఎస్సీ చేశా. ఫిల్మ్ ఇండస్ట్రీపై ఆసక్తితో కన్నడలో ఎంట్రీ ఇచ్చాను. అక్కడ ఏడు సినిమాలు చేశా. అక్కడ చేసిన చిత్రాలన్నీ ఆర్ట్ బేస్డ్. పెర్ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకునే పాత్రలే చేశా. తెలుగులో ఇది డెబ్యూ మూవీ. ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ కావడంతో హ్యాపీగా ఉంది. ఇకపై కమర్షియల్ చిత్రాల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుంది.
రామ చక్కని సీత దర్శకుడు శ్రీహర్ష -్ఫ్యమిలీ ఫ్రెండ్. అయినా రెండుసార్లు ఆడిషన్స్‌లో రిజెక్ట్ చేసి, మూడోసారి నన్ను ఎంపిక చేశారు. పవన్ కల్యాణ్ అభిమానిగా -తొలిప్రేమ చిత్రంలోని లీడ్ రోల్స్ పేర్లే ఈ సినిమా లీడ్ రోల్స్‌కు పెట్టారు. బాలుగా హీరో ఇంద్ర, అనుగా నేను కనిపిస్తాం.
తెలుగు ఇండస్ట్రీకి మంచి టైంలో వచ్చాననిపిస్తోంది. ఇండస్ట్రీలో కొత్తవాళ్లకు మంచి చాన్స్‌లు వస్తున్నాయి. సో, ఈ సినిమా తరువాత నాకూ మంచి చాన్స్‌లు వస్తాయనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చింది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే సీమాంధ్ర కవర్ చేశాం. అక్కడ మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ. తెలుగులో హీరోయిన్లకూ ఫాలోయింగ్ చూస్తుంటే సంతోషమనిపిస్తోంది. ఇండస్డ్రీలో చాలా ఎంకరేజ్‌మెంట్ ఉంది.
రామ చక్కని సీత -ఓ రొమాంటిక్ కామెడీ. ప్లస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అను పాత్రకు మంచి డైలాగులు, ఎక్కువ క్లోజప్ షాట్స్ ఉన్నాయి. సో, పాత్రకు తగిన రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాననే అనుకుంటున్నా. హీరో, హీరోయిన్లు తప్ప మిగితావాళ్లంతా తెలిసిన ఆర్టిస్టులే కావడం నాకు ప్లస్ పాయింట్. మంచి టెక్నీషిన్స్ సినిమా కోసం పని చేశారు.
తెలుగు సినిమాలు చాలా చూశాను, చూస్తుంటాను. ఏ హీరో నచ్చుతాడని అడిగితే ప్రత్యేకంగా చెప్పలేను. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హై ప్రొఫైల్‌లో ఉంది. ఇక్కడి హీరోలంతా వర్సటైల్ ఆర్టిస్టులే. ఫలానావాళ్లు నచ్చుతారని ప్రత్యేకంగా చెప్పలేం. కానీ, హీరోలంతా ఒకరికొకరు సపోర్టివ్‌గా ఉండే కల్చర్ బాగా నచ్చింది. ఏ ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాతావరణం ఉండదు. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే -బాలకృష్ణ అంటే నాకు ఇష్టం.