ఈ ప్రేమ కథలో అశ్లీలత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ1 ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీస్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా రామ్ రణధీర్ దర్శకత్వం వచ్చిన చిత్రం -రాయలసీమ లవ్ స్టోరీ. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రలు పోషించారు. 27న సినిమా విడుదలకానున్న నేపథ్యంలో చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ -సినిమాలో చోటుచేసుకున్న వల్గారిటీ సీమవాసుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, టైటిల్ మార్చాలంటూ కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్లకు చెప్పేదొక్కటే -యూత్‌కు మెసేజ్‌లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీనే చూపించాం.
సినిమా చూశాక అభ్యంతరాలుంటే -సరిదిద్దుకోడానికి సిద్ధమే అన్నారు. నిర్మాతలు చిన్నా, నాగరాజు మాట్లాడుతూ -కష్టపడి చేసిన సినిమా. విడుదల సమయంలో టైటిల్‌పై అభ్యంతరాలు మంచిది కాదు. సినిమాలో ఏం చెప్పామో తెలీకుండా అభ్యంతరాలు వ్యక్తం చేయటం సబబు కాదు. సీమ ప్రాంతంలో ప్రేమలు ఎంత బలంగా ఉంటాయో చెప్పే చిత్రమిది. చిన్న సినిమాలపై అనవసరమైన ఆవేశాలు తగదు అన్నారు.