జంగిల్‌బుక్ సీక్వెల్ వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్డ్ డిస్నీ సంస్థ రూపొందించిన ‘జంగిల్‌బుక్’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అడవి జంతువుల సంరక్షణలో ఎదిగిన ఓ అనాథ బాలుడి సాహసయాత్ర కథాంశంగా రూపుదిద్దుకున్న ఈ అమెరికన్ కల్పితకథకు సెల్యులాయిడ్ రూపమే జంగిల్‌బుక్. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ‘వౌగ్లి’గా నీల్‌సేథి నటించాడు. చిత్రం అంతా లాస్‌ఏంజిలిస్‌లోనే నిర్మించారు. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ విడుదల చేసిన యానిమేషన్ చిత్రాల పరంపర (జంగిల్‌బుక్) ఆధారంగా అదే పేరుతో దీనిని రూపొందించారు. ఆ కథకు మెరుగులుదిద్ది రచయిత జస్టిస్ మార్కె, దర్శకుడు ఫాలెరూ, నిర్మాత బ్రిగహమ్‌టేలర్‌ల సారథ్యంలో రూపొందిన ‘జంగిల్‌బుక్’ ఈనెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసువద్ద రికార్డులు తిరగరాసింది. భారత్‌లో తొలి మూడురోజుల్లో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జంగిల్‌బుక్ సీక్వెల్‌కు వాల్డ్‌డిస్నీ సిద్ధమైంది. ఈ సంస్థ రూపొందించిన ఇతర చిత్రాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన ‘క్రుయెల్లా’, ‘101 డాల్మేషియన్స్’, ‘మేలెఫిసెంట్’ల సీక్వెల్స్ సిద్ధంగా ఉన్నాయి. జంగిల్‌బుక్ సీక్వెల్ సహా ఈ చిత్రాల్లో వేటిని ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయాన్ని ఆ సంస్థ స్పష్టం చేయడం లేదు. వచ్చే మూడేళ్లలో ఇవి ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది.