18న కృష్ణారావ్ సూపర్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై కమెడియన్ గౌతంరాజు కొడుకు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం -కృష్ణారావ్ సూపర్ మార్కెట్. ఈ సినిమాతో శ్రీనాథ్ పులకరం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అక్టోబర్ 18న సినిమాను థియేటర్లకు తెస్తున్న సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ -సూపర్ మార్కెట్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఇది. పాత్రకోసం కష్టపడిన హీరో హీరోయిన్ కృష్ణ, ఎల్లాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తున్న టైంలో వస్తున్న చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుందనే నమ్ముతున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -టీజర్‌తో సినిమాకు మంచి బజ్ వచ్చింది. వచ్చే 18న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు. చిత్రంలో తనికెళ్ల భరణి, గౌతంరాజు, బెనర్జీ, రవిప్రకాష్, సన తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు.