కల్యాణ్.. ఎంత మంచోడో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం -ఎంత మంచివాడవురా. ఉమేష్‌గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్నారు. దర్శకుడు సతీష్ వేగెశ్న తెరకెక్కిస్తోన్న చిత్రంలో కల్యాణ్‌తో మెహరీన్ జోడీకడుతోంది. నిర్మాత ఉమేష్ గుప్తా, సమర్పకుడు కృష్ణప్రసాద్ షూటింగ్ వివరాలు వెల్లడిస్తూ -సినిమా బాగా వస్తోంది. ఆగస్టు 26నుంచి రాజమండ్రి, పెండ్యాల, పురుషోత్తమపట్నం, వంగలపూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిపల్లి పరిసరాల్లో షూటింగ్ జరుపుతున్నాం. సెప్టెంబర్ 25 వరకూ షెడ్యూల్ కొనసాగుతుంది. ఏకధాటిగా జరుగుతోన్న షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. తొర్రేడులో భారీ జాతర సెట్ వేసి హీరో కల్యాణ్‌రామ్, నటాషా దోషిలపై సాంగ్ షూట్ చేశాం. అలాగే పెండ్యాల ఇసుక ర్యాంపుల మధ్య భారీఎత్తున తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అవుతుంది. వంగలపూడి సమీపంలో గోదావరిలో 16 బోట్లతో తెరకెక్కించిన ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ సినిమాకు హైలెట్. జనవరి 15న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.
దర్శకుడు సతీష్ వేగెశ్న మాట్లాడుతూ -రాజమండ్రి పరిసరాల అందాలను చిత్రంలో చూపించనున్నాం. అక్టోబర్ 9 నుంచి 22 వరకు హైదరామాద్‌లో మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ తరువాత నాల్గవ షెడ్యూల్ కేరళ, కర్ణాటకల్లో కొన్ని ప్రధాన సన్నివేశాలు తెరకెక్కించటంతో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు.