ఎమోషనల్ ప్రమోషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదైనా, చిన్నదైనా -జనాల్లోకెళ్తేనే సినిమా సక్సెస్‌కు రూటుపడినట్టు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ చిత్రంగా నిర్మాత రామ్‌చరణ్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం -సైరా. నిజానికి ‘సైరా’ టీంకి హోరెత్తించే ప్రమోషన్స్ నిర్వహించే ఆర్థిక సత్తా ఉంది. అయినా -పదిమందితో ఓ మంచి మాట చెప్పించే ‘ఎమోషనల్ ప్రమోషన్’కూ ప్రాధాన్యత ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అందుకు ఇండస్ట్రీ కనెక్షన్స్, రిలేషన్స్ రూపంలోవున్న రామ్‌చరణ్ గుడ్‌విల్‌ను.. ప్రమోషన్స్‌కు ప్రథమ భాగంలో పెడుతున్నట్టు కనిపిస్తోంది. పైగా, సినిమాలో సౌత్ క్రేజీ స్టార్స్‌తోపాటు బాలీవుడ్ స్టార్స్ సైతం పాత్రలరూపంలో ఉండటంతో -ప్రమోషన్స్‌కి ఆయా పాత్రల స్టామినానూ వాడుకునే సరైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం దబాంగ్ 3ని సౌత్‌నుంచి రామ్‌చరణ్ ప్రమోట్ చేసినపుడే -తరువాతి స్టెప్ సల్లూబాయ్ కోర్టులో ఉంటుందని అంతా ఊహించారు. ఇప్పుడు -బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ‘సైరా’ ట్రైలర్‌ని ట్వీట్ చేస్తూ చరణ్, చిరంజీవికి విషెస్ చెప్పటం ‘ఎమోషనల్ ప్రమోషన్’లో భాగమనే అనుకోవాలి. నిన్నమొన్నట వరకూ సైరాని సీరియస్‌గా తీసుకోని బాలీవుడ్ -సల్లూ భాయ్ ట్వీట్‌తో ప్రత్యేకంగా చూస్తుందన్న విషయం అంచనా వేయగలిగేదే. పైగా బాలీవుడ్ వర్షన్‌కి భాయ్ ఆశీస్సులు ప్లస్సవుతాయనే అంటున్నారు.
దీనికితోడు -ట్రైలర్‌ను మరో ఖాన్‌భాయ్ అమీర్ సైతం ‘ఆహా’ అంటూ ఎత్తేశాడు. ‘ఆకలేకపోతున్నా. సినిమా కోసం ఎదురు చూస్తున్నా. చిరంజీవికి నేనో పెద్ద ఫ్యాన్. భారీ స్కేల్ మూవీ విడుదల తేదీ ఎప్పుడొస్తుందా? అన్న ఆసక్తితో చూస్తున్నా’నంటూ ట్వీట్ చేశాడు. ఓ పెద్ద చిత్రం థియేటర్లకు వచ్చే సమయంలో స్టార్ హీరోలంతా పాజిటివ్ రెస్పాన్స్ మామూలు విషయమే అయినా -ఆడియన్స్ ఎమోషనల్ డ్రైవ్‌కు ఈ కామెంట్లు బలంగా ఉపయోగపడతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తన సినిమాలపైనే పెద్దగా మాట్లాడని జక్కన్న సైతం ‘సైరా’ ట్రైలర్‌కు కితాబునివ్వడం మనసులోంచి వచ్చిందే అయినా -దాని రిజల్ట్ మాత్రం ప్రాజెక్టు స్టామినాకు దన్నునిచ్చేదే. ట్రిపుల్ ఆర్‌లో రామ్‌చరణ్ భాగం కనుక -ఆ ప్రాజెక్టు దర్శకుడు జక్కన్న... మగధీర తరువాత దూరమై దగ్గరైన హీరో నిర్మాత రామ్‌చరణ్‌కు సపోర్ట్‌నివ్వడం ప్రత్యేక విషయం కాకపోవచ్చు. ఇక -చిరు డ్రీమ్ ప్రాజెక్టు కావడం, సమరయోధుడి కథ ఇతివృత్తమవ్వడం.. మెగా కాపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్టు.. బాహుబలి తరువాత సాహో ఇలా భారీ బడ్జెట్ చిత్రాలను గౌరవించే సంస్కృతి పెరుగుతుండటం.. వెరసి -తెలుగు సినిమా సెలబ్రిటీలూ ‘ఎమోషనల్ విషెస్’నివ్వడం సైరా ప్రమోషన్‌కు బిగ్ అస్సెట్ అనే అనాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను చూపించేందుకు సైరా చిరంజీవి -అక్టోబర్ 2న థియేటర్లకు వస్తోన్న విషయం తెలిసిందే.