అతనే హీరో.. ఈమె హీరోయిన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమాలో రానా- కాజల్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌటైంది. సినిమా ఓ రేంజ్ విజయాన్నీ సాధించింది. అదే రానా -కాజల్ మరో కొత్త ప్రాజెక్టు కోసం ‘కెమిస్ట్రీ’ని రిపీట్ చేయనున్నారన్నది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. వీళ్లిద్దర్నీ స్క్రీన్‌పై చూపించేందుకు ‘ఓ బేబీ’ డైరెక్టర్ నందినిరెడ్డి ఓ ప్రాజెక్టు రెడీ చేస్తున్నట్టు సమాచారం. మాఫియా నేపథ్యంగా సాగే కొరియన్ మూవీ రీమేక్ హక్కుల్ని రానా సొంతం చేసుకున్నాడట. అదే కథలో రానా హీరోగా నందినీరెడ్డి తెరకెక్కించే అవకాశం ఉందన్నది ఫిల్మ్‌నగర్ టాక్. టాప్ హీరోయిన్లతో సమానంగా ఇమేజ్ కొనసాగిస్తున్న కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా సంప్రదించినప్పటికీ -ఆమె డేట్స్ లేవని చెప్పేసినట్టు సమాచారం. తెలుగులో ‘మిస్ ఇండియా’, హిందీలో ‘మైదాన్’తో బిజీ కారణంగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేనంటూ కీర్తి చెప్పేసిందని అంటున్నారు. దాంతో కాజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.