ఆథరైజ్డ్ డ్రింకర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో కార్తికేయ చేస్తున్న తాజా చిత్రం -90 ఎంఎల్. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తోన్న చిత్రంతో శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సెప్టెంబర్ 21న కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా 90 ఎంఎల్ టీజర్ విడుదవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌రెడ్డి చిత్ర విశేషాలు చెబుతూ -హీరో కార్తికేయ పాత్ర పేరు దేవదాస్. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. అంతటి విద్యావంతుడు ఆథరైజ్డ్ డ్రింకర్‌గా పాపులరవుతాడు. అతను ఎందుకు డ్రింకరయ్యాడు? ముఖ్యంగా ఆథరైజ్డ్ డ్రింకర్‌గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడు?లాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. హిలేరియస్ మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూర్చుని ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది అన్నాడు. నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ -కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తున్నాం. టీజర్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. కామన్ మేన్‌కీ కనెక్టయ్యేలా కానె్సప్ట్ ఉంటుంది. ఇటీవలే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేసిన సెట్‌లో భారీ ఎత్తున క్లైమాక్స్ చిత్రీకరించాం. అక్టోబర్ 7కి టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాటలను యూరప్‌లో చిత్రీకరిస్తాం’ అన్నారు. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయన్ పాత్ర చేస్తోంది.