డిసెంబర్‌లో వెంకీమామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేనమామా -మేనళ్లులిద్దరూ ఆడియన్స్‌ని డిసెంబర్‌లోనే ఎంటర్‌టైన్ చేయనున్నారట. దసరాను టార్గెట్ చేస్తూ ‘వెంకీమామ’ను శరవేగంగా పూర్తిచేసినా -పోటీలేని టైంలో సినిమా విడుదల చేయడం మంచిదన్న ఆలోచనకు నిర్మాతలు వచ్చినట్టు తెలుస్తోంది. సో, డిసెంబర్ స్లాట్స్‌లో వెంకీమామ థియేటర్లకు రావొచ్చన్నది ఓ టాక్. వెంకటేశ్- చైతూలను మేమమామ- మేనల్లుడిగా చూపిస్తూ దర్శకుడు బాబి తెరకెక్కిస్తోన్న చిత్రం -వెంకీమామ. హీరోయిన్లుగా రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కనిపించనున్నారు. అటు యూత్‌ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేలా వినోదభరిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం -పాట వినా షూటింగ్ పూరె్తైంది. దసరాకు సినిమాను తేవాలనుకున్నా -పోటీ ఎక్కువ ఉండటంతో డిసెంబర్ ఫస్టువీక్‌లో విడుదల చేసే యోచనతో ఉన్నట్టు సమాచారం. ఎఫ్2లో హీరో వరుణ్‌తో కలిసి ఆడియన్స్‌ని పూర్తిగా ఎంటర్‌టైన్ చేసిన వెంకటేష్ -మరోసారి వెంకీమామలో చైతూతో కలిసి మరింత అల్లరి చేయనున్నట్టు తెలుస్తోంది.