టీజర్‌కొచ్చిన..90 ఎంఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 ఇమేజ్‌ని మరో మెట్టేక్కించే కొత్త చిత్రమేదీ హీరో కార్తికేయ కెరీర్‌లో పడటం లేదు. యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిన ఆర్‌ఎక్స్‌లాంటి మరో మంచి సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా -తరువాతి ప్రాజెక్టులేవీ అంత పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇటీవల ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ సినిమాలో చేసిన విలన్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టినా -కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడేదేం కాదు. కార్తికేయ హీరోగా చేస్తున్న తాజా ప్రాజెక్టు -90 ఎంఎల్. దర్శకుడు శేఖర్‌రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ గుమ్మకొండ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్‌ను 21న బయటకు తెస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేస్తూ -్ఫస్ట్ టీజర్‌నుంచే ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తోంది. 90ఎంఎల్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.