కథ’ మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాక్షసుడు రీమేక్‌తో హీరో బెల్లంకొండలో చాలా మార్పే కనిపిస్తోంది. హీరోగా ఎర్లీ డేస్‌లో చేసిన పొరబాట్లు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ చేయనంటూ గట్టిగానే నిలబడుతున్నాడు. మాస్‌కి కేరాఫ్ అడ్రెస్ వాస్ అనే స్థాయిలో సినిమాలు చేసేసిన బెల్లంకొండ -మాసిజాన్నీ సరైన పల్స్‌తోనే చూపించాలన్న అనుభవంతో వ్యవహరిస్తున్నాడు. తెలుగు రీమేక్‌గా వచ్చిన ‘రాక్షసుడు’లో సాయి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ వర్కౌటవ్వడం, కథాపరంగా సరైన నిర్ణయం తీసుకున్నానన్న భావనకు రావడంతో -కథల విషయంలో తొందరపడేది లేదంటూ చెప్పుకొస్తున్నాడు. అన్నట్టుగానే కానె్సప్ట్ బేస్డ్ కొత్తదనంతో కూడిన కథలనే అంగీకరించాలన్న నిర్ణయంతోనే ఉన్నాడట. హీరోగా స్టామినా చూపించాలంటే స్టార్ డైరెక్టర్లతోనే కాదు, టాలెంట్‌వున్న కొత్త డైరెక్టర్లతోనూ సినిమాలు చేసేందుకు సిద్ధపడుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. కొత్త దర్శకుల నుంచి కథలు వినడానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నాడట. సో, బెల్లంకొండ నుంచి రెగ్యులర్ ఫ్యాట్రన్ కాకుండా, రాక్షసుడులాంటి డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ఆశించొచ్చన్న మాట.