డిస్కోరాజా కోసం.. ఎఫ్‌ఎఫ్ 7 టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ హీరోగా, పాయల్ రాజ్‌పుత్, నభానటేష్, తాన్యాహోప్ హీరోయిన్లుగా ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై విఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం -డిస్కోరాజా. నిర్మాత రామ్ తళ్ళూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం. డిసెంబర్ 20న డిస్కోరాజా విడుదలకానుంది. తాజాగా గోవాలో నిర్వహించిన షెడ్యూల్‌లో 15 రోజులపాటు కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. యూరోప్‌లోని ఐస్‌లాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. ఐస్‌లాండ్‌లో జరగనున్న షెడ్యూల్‌లో హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, అలాగే పలు అంతర్జాతీయ చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్లు రంగంలోకి దిగుతున్నారని నిర్మాత వెల్లడించారు. తమన్ మ్యూజిక్, కార్తిక్ ఘట్టమనేని విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నూలి ఎడిటింగ్ సినిమాకు ఎంతో ప్లస్సవుతాయన్న నమ్మకంతో చిత్రబృందం ఉంది. బాబీ సింహ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. ఇప్పటికే విడదలైన ప్రీ లుక్‌కి మంచి స్పందన రావడం తెలిసిందే.