పవన్ కొత్తసినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ భారీ అపజయాన్ని మూటకట్టుకుంది. దీనినుంచి కోలుకున్న పవన్ ఇప్పుడు కొత్త సినిమాపై దృష్టిపెట్టారు. ఈనెల 29న పవన్‌కళ్యాణ్ కొత్తసినిమా మొదలుకానుంది. ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తయింది. పవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆరోజే అనౌన్స్ చేస్తారు. ‘ఖుషి’వంటి సూపర్ డూపర్‌హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కొమరం పులి’ భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్లీ మూడోసారి వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నట్టు అన్నయ్య చిరంజీవి కూడా తన 150వ సినిమాకు అదే రోజు ముహూర్తం పెట్టాడు మరి!!