సాయితేజ్‌తో నభా రొమాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్లు అందాలు ఆరబోసినంత మాత్రాన అవకాశాలు వచ్చేస్తాయా? అన్న చాదస్తపు మాటలు ఇండస్ట్రీ బయటినుంచి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. వీటిని పట్టించుకోని అందగత్తెలు మాత్రం స్క్రీన్‌మీద -హద్దుల్లేని స్కిన్ షోతో ఆడియన్స్‌ని మురిపించి అవకాశాలు అందుకుంటూనే ఉంటారు. ఈ విషయంలో మంగళూరు మల్లెతీగ మాత్రం రేసులో రెండడుగులు ముందుంది. స్క్రీన్‌మీదే కాదు, సోషల్ మీడియాకూ ఫొటో షూట్స్ షేర్ చేసి బులిపించటంలో తెగ యాక్టివ్. ఆ బ్యూటీయే -నభానటేష్. ఇస్మార్ట్ శంకర్‌లో ఆమె అందాల ఆరబోతకు తగిన ప్రతిఫలం దక్కి, మెగా కాంపౌండ్‌లో చోటుదొరికిందట. ఇస్మార్ట్ శంకర్ హిట్టు కొట్టినపుడే -నభాను వెతుక్కుంటూ చాన్స్‌లు రావొచ్చనుకున్నారు. రామ్‌తో రొమాన్స్‌లో స్క్రీన్‌మీద ఆమె చేసిన స్కిన్ షోకి యూత్ ఫిదా అయిపోవడం తెలిసిందే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సైతం ఆడియన్స్‌కి సంతృప్తినిచ్చింది. పాత్రపరంగానూ వైవిధ్యాన్ని చూపించిన నభా -సాయితేజ్‌కు జోడీగా కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసిందట. టైటిల్ ఖరారుకాని ప్రాజెక్టు వచ్చే నెలనుంచే మొదలుకావొచ్చని అంటున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ప్రాజెక్టును డెబ్యూ డైరెక్టర్ సుబ్బు తెరకెక్కిస్తాడట. ప్రస్తుతం మారుతితో సాయితేజ్ ప్రతిరోజు పండగే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. దాన్ని వేగంగా ముగించి, కొత్త ప్రాజెక్టుతో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న చిత్రంలో -కథానాయిక పాత్ర హీరో పాత్రతో సమానంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం నభానటేష్ రవితేజ డిస్కో రాజా ప్రాజెక్టులో ఉంది. అలాగే అకిల్ అక్కినేని కొత్త ప్రాజెక్టులోనూ నభాకు చోటుదక్కే అవకాశాలున్నాయి.