ఔను.. ప్రేమలోపడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి లవ్ లైఫ్‌మీద వాయిస్ ఓపెన్ చేసింది -తాప్సి పన్ను. ‘నేను ప్రేమలో పడ్డాను’ అంటూ చెప్పేసింది. అయితే, పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చాకే పెళ్లాడతానంటూ మెలిక పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తాప్సి కెరీర్ సూపర్ హిట్‌లో ఉంది. పనికిరావన్న చోటే -మంచి అవకాశాలు అందుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. ‘సాద్ కీ ఆంఖ్’ ప్రమోషన్స్‌లో బిజీగావున్న తాప్సీ, తాజా ఇంటర్వ్యూలో ‘లవ్’ ఎపిసోడ్‌ని ఓపెన్ చేసింది. ‘అతను క్రికెటర్ కాదు. నటుడూ కాదు. అసలు ఈ ప్రాంతానికే చెందిన వాడు కాదు. నా చెల్లి ద్వారా పరిచయమయ్యాడు. అతనితో లవ్‌లో ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చింది సొట్టబుగ్గల సుందరి. పెళ్లంటూ చేసుకుంటూ రోజుల తరబడి వేడుక చేసుకునే ఆలోచన లేదని, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కరోజులో వేడుక పూర్తవుతుందని మనసులో మాట చెప్పింది. మనసుకు నచ్చిన చెలికాడిని పరిచయం చేసినందుకు తన చెల్లికి జీవితాంతం కృతజ్ఞతలు చెబుతూనే ఉంటానంటోంది మూడు పదుల ముద్దుగుమ్మ.