ఆ అనుభూతి.. మాటలకతీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పాత్రకోసం స్టడీలో భాగంగా ఢిల్లీలోని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ శిక్షణ శిబిరానికి వెళ్లాం. అక్కడే మూడు రోజుల క్యాంపుచేసి కమాండోల శిక్షణ తీరు తెలుసుకున్నా. పోలీస్‌లాంటి అంతర్గత రక్షణ బలగాలకు, బాహ్య ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించే ప్రత్యేక రక్షణ దళాలకు ఆలోచనతీరులో చాలా వ్యత్యాసం కనిపించింది. మనం బతకడానికి జీతం తీసుకుంటాం. వాళ్లు ప్రాణాలివ్వడానికి జీతం తీసుకుంటున్నారు. అదీ వ్యత్యాసం. అది అర్థమైన తరువాత మైండ్ బ్లాంక్ అయ్యింది నాకు. అదో గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.

దేశానికి రక్షణగా నిలిచే ఓ కమాండో జీవితం ఎంత సమున్నతమైందో తొలిసారి అనుభవంలోకి వచ్చిందంటున్నాడు తమిళ హీరో సూర్య. దేశంలోని వివిధ సంఘటనల సమాహారాన్ని రక్షణ దళాల కోణంలో చూపిస్తూ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తమిళ దర్శకుడు కెవి ఆనంద్ తెరకెక్కిస్తోన్న చిత్రం -కాప్పాన్. తెలుగులో ‘బందోబస్తు’ పేరిట సెప్టెంబర్ 20న విడుదలవుతోంది. మోహన్‌లాల్, ఆర్య, సముద్రఖని, సాయేషా సెహ్‌గల్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సూర్య -కాప్పాన్ చిత్ర అనుభవాలపై మీడియాతో మాట్లాడారు.
దర్శకుడు కెవి ఆనంద్ కథలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. సమాజంలో చోటుచేసుకునే సంఘటనలకు ప్రతిబింబాలే ఆయన చిత్ర కథనాలన్నీ. ఏ సంఘటనను తీసుకున్నా పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసి కథను అల్లుకుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో చెప్పినా -దర్శకుడి కథనంలోని సాంధ్రత వైవిధ్యంగా ఉంటుంది.
దేశ రక్షణ విభాగంలో అత్యున్నత స్థానంలోవున్న అధికారి -రోగ్‌గా మారితే.. దేశ రక్షణ పరిస్థితేమిటి? ఎలాంటి పర్యావసనాలు తలెత్తాయన్న కోణంలో సాగే కథ ఇది. అటు ఢిల్లీ నుంచి ఇటు కన్యాకుమారి వరకూ -దేశంలోని కొన్ని సంఘటనల సమాహారంగా కథ నడుస్తుంది.
చిత్రమేంటంటే దర్శకుడు కెవి ఆనంద్ కథను అల్లుకున్న తరువాత.. -అలాంటి పరిణామాలే కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. అంటే కథలోని సంఘటనలు తరువాతి కాలంలో సంభవించటం యాదృచ్ఛికమే అయినా -దర్శకుడి ముందుచూపు, ఆలోచనశక్తికి అదొక గొప్ప ఎగ్జాంపుల్.
కథ విన్నపుడు కంటే -తెలుసుకుంటూ ముందుకెళ్లేకొద్దీ ఈ పాత్రను చేయగలనా? అన్న సంశయం తలెత్తింది. పాత్రను జీర్ణించుకోడానికి ఎస్పీజీలో హయ్యస్ట్ పొజిషనల్‌లో ఉన్న కొందరిని కలిశాను. కాకపోతే, వాళ్ల పేర్లు చెప్పడం ఎంతమాత్రం గౌరవం కాదు.
కమాండర్స్‌ని కలిసినపుడు -అలాంటి సమున్నతమైన జీవితం మనకు లేదనిపించింది. కనీసం పాత్ర పరంగానైనా చేయడం చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఈ పాత్ర చేసిన తరువాత రక్షణ దళాలమీద నాకున్న గౌరవం మరింత ఇనుమడించింది.
దక్షిణ ప్రాంతం నుంచి దేశాన్ని చూడటం వేరు. దేశం నడిబొడ్డునుండి భారత్‌ను చూడటం వేరు. అక్కడి అధికారులు, రాజకీయ నేతలు, ఉన్నతస్థానాల్లోని వ్యక్తులతో మాట్లాడిన తరువాత -దేశంపట్ల దృక్ఫథమే మారిపోయిందన్న భావన గొప్పగా అనిపిస్తోంది.
సినిమాలో ఇదీ కథ అని చెప్పలేం. అనేక సంఘటనల సమాహారంగా ఉంటుంది. అన్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్సే. సినిమా కచ్చితంగా ఆడియన్స్‌కి నచ్చుతుందని భావిస్తున్నా.
ఇది సూర్య సినిమా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే -సినిమాలోని పాత్రధారులంతా హీరోలే. మోహన్‌లాల్, ఆర్య, బొమన్ ఇరాని, సముద్రఖని, ఆయేషా.. అందరివీ అతి ముఖ్యమైన పాత్రలు. అంతా కథలో భాగంగానే ఉంటారు కనుక -ఒక హీరో సినిమా అని చెప్పలేం. దర్శకుడు అంత అద్భుతంగా కథను డిజైన్ చేశాడు.
నా పాత్రకు సంబంధించి గెటప్పులన్నీ సినిమాటిక్ కాదు. లైఫ్‌కి సంబంధించి, మిషన్‌కు సంబంధించి ఉండే షేడ్స్‌లోనే పాత్ర కనిపిస్తుంది కనుక, వాటిని గెటప్స్ అనలేం.
సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్‌తో నాకు 9వ సినిమా -కాప్పాన్. హారిస్ స్టామినా గురించి చెప్పేదేముంటుంది. కథలోని ఇంటెన్సిటీని పెంచేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఇక గజిని చిత్రానికి చేసిన ఎడిటర్ ఆంటోనీ ఈ సినిమాకూ మరో పిల్లర్. ఒకరనికాదు, టెక్నీషియన్లు అంతా ఎక్స్‌పర్ట్స్ పనిచేశారు.
కథానాయిక పాత్ర పోషించిన సాయేషా వెరీ హార్డ్ వర్కర్. వేరే భాషనుంచి వచ్చినా, కమిటెడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. కథకు ఆమె పాత్ర కీలకం. అలాగే, ఆర్య జనరస్. నాకు మంచి మిత్రుడు కూడా. అతని పాత్ర అర్థవంతంగా ఉంటుంది.
సూర్య ఉన్నాడంటే -ఆడియన్స్ యాక్షన్ సీన్స్ ఆశించటం మామూలే. అందుకు తగ్గట్టుగానే బందోబస్తు చిత్రంలోనూ ఎక్కువ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగని ఎమోషన్ సీన్స్ లేవని కాదు. కమాండోస్ లైఫ్‌లోని చాలా ఎమోషన్ చూస్తారు.
కాప్పాన్ కోసం కష్టపడిన మాట వాస్తవం. స్క్రిప్ట్ దశనుంచే దర్శకుడు కెవి ఆనంద్ మేగ్జిమం వర్క్ చేశాడు. యునీక్ కథకు ప్రాణం పోయడానికి టీం మొత్తం ప్రాణం పెట్టింది. దేశంలోని అనేక లొకేషన్లతోపాటు, లండన్‌లోనూ 150 రోజులపాటు షూటింగ్ జరిపాం.
నా తరువాతి ప్రాజెక్టులు ఇంకా కథా చర్చల్లోనే ఉన్నాయి. ఫైనల్ కాలేదు.
భారీ బడ్జెట్‌తో వస్తున్న ‘సైరా’ ఓ గౌరవప్రదమైన సినిమా. అలాంటి చిత్రాన్ని నిర్మిస్తున్న మిత్రుడు రామ్‌చరణకు అభినందనలు. ఇక త్వరలో థియేటర్లకు వస్తున్న విక్రమ్ చిత్రం నానీస్ గ్యాంగ్‌లీడర్, హరీశ్‌శంకర్ ‘వాల్మీకి’ చిత్రాలకూ అభినందనలు.

-మహాదేవ