ముగింపుకొచ్చిన ‘ఉల్లాలా ఉల్లాలా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటుడు సత్యప్రకాష్ పేరు చెప్పగానే ‘పోలీస్ స్టోరీ’ సినిమా గుర్తుకొస్తుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతి నాయకుడు, సహాయక పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. 11 భాషల్లో 500కు పైగా చిత్రాలు చేసిన సీనియర్ నటుడు తొలిసారి మెగాఫోన్ చేతపట్టాడు. సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం -ఉల్లాలా ఉల్లాలా. గత వేలంటైన్స్ డేకి ‘లవర్స్‌డే’ చిత్రాన్ని విడుదల చేసి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుఖీభవ మూవీస్ అధినేత ఎ గురురాజ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ -అనేక భాషల్లో నటించి నటుడిగా పూర్తి సంతృప్తితోవున్నా, దర్శకత్వం చేపట్టాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఇదో రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్. సినిమాలో చాలా వింతలూ విశేషాలున్నాయి. అనూహ్యరీతిలో సినిమా ఉంటుంది. మేకింగ్ పరంగానూ కొత్త ఫీల్‌నిస్తుంది. నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం అదృష్టం అన్నారు. నిర్మాత ఎ గురురాజ్ మాట్లాడుతూ -నటుడిగా సత్యప్రకాష్‌లో ఎంత ఫైర్ ఉందో, దర్శకుడిగా అంతకంటే ఎక్కువ ఉంది. అందుకే నా కథను ఆయనకు అప్పగించాను. మేకింగ్‌పరంగానూ కాంప్రమైజ్ కాలేదు. ‘ఉల్లాలా ఉల్లాలా’ నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కూ మంచి పేరు తెస్తుంది అన్నారు.