మరో.. సాహసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో గోపీచంద్ కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ప్రొడక్షన్ నెం.26గా నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. బిను సుబ్రహ్మణ్యం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమాను ఇండియా సహా నేపాల్, కాంబోడియా, థాయ్‌లాండ్‌లో చిత్రీకరిస్తారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న చిత్రానికి సతీశ్‌కురుప్ సినిమాటోగ్రఫీ సమకూర్చనున్నాడు. హీరోయిన్, మిగిలిన నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని యూనిట్ పేర్కొంది. సాహసం తర్వాత గోపీచంద్, బివిఎస్‌ఎన్ ప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. గోపీచంద్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నామని, అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రమవుతుందని దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం తెలిపారు.