18న సైరా ప్రీరిలీజ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమరయోధుడి కథను జనం వద్దకు తీసుకెళ్లే ప్రమోషనల్ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అతి పెద్ద సాహో మోత మోగకపోవటం, మీడియం రేంజ్ సినిమాల హడావుడి నేటితో సద్దుమణగటంతో -సైరా ప్రచారపర్వాన్ని హోరెత్తించేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోందని సమాచారం. అనుకున్న సమయం అక్టోబర్ 2నే సినిమాను థియేటర్లకు తేవాలన్న నిర్ణయానికి ఫిక్సవ్వడంతో -పక్షం రోజుల ముందునుంచీ ప్రచారపర్వం పెద్దఎత్తున నిర్వహించాలని ప్రణాళికల సిద్ధం చేశారట. మొదట టాలీవుడ్‌లో సెప్టెంబర్ 15న పెద్దఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి ప్రమోషన్స్‌కు తెరలేపాలనుకున్నారు. అయితే, తాజా ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 18న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. పైగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత ప్రాంతమైన కర్నూలులో వేడుకను నిర్వహించాలని తొలుత అనుకున్నా -సాంకేతిక, వాతావరణ కారణాలరీత్యా హైదరాబాద్‌లోనే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు నిర్మాత రామ్‌చరణ్ నిర్ణయించాడని అంటున్నారు. ఎలాంటి ఆటంకాలకు తావులేకుండా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ నిర్వహించేందుకు రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇంతవరకూ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు.