కొత్త ప్రాజెక్టుకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోగ్గాడే చిన్నినాయిన చిత్రం నుంచి పుట్టిన బంగార్రాజు స్క్రీన్‌మీద చూపించినంత స్పీడు -కొత్త ప్రాజెక్టుపై చూపించలేకపోతున్నాడు. అనుకోని అవంతారాలో, కావాలనో నాగ్ లేట్ చేస్తన్నాడో అర్థంకాదు కానీ, బంగార్రాజు పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యంకాకపోవచ్చన్న పరిస్థితే కనిపిస్తోంది. నిజానికి ‘మన్మథుడు 2’కి ముందే బంగార్రాజు కథను అనుకున్నా -మొదలుపెట్టడం సాధ్యం కాలేదు. మన్మథుడు 2 తరువాత -దర్శకుడు కల్యాణ్‌కృష్ణ ప్రాజెక్టునే నాగార్జున పట్టాలెక్కిస్తాడని అనుకున్నారు. మన్మథుడు 2 ప్రమోషన్స్ టైంలోనూ మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైనపుడు -నాగ్‌లో అంత ఆసక్తి కనిపించలేదు. టైం కలిసి రావడం లేదంటూ సింపుల్‌గా చెప్పేశాడు. బంగార్రాజు ప్రాజెక్టులో నాగ్‌తోపాటు చైతూకీ కీలకమైన పాత్ర ఉంది. ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలే ఎక్కువ. ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, మళ్లీ బంగార్రాజుకి టైం దొరకని పరిస్థితి వచ్చింది. చైతూ కమిట్‌మెంట్స్ పూర్తయ్యేలోగా -నాగ్ మరో ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నాడట. మహేశ్‌బాబు ‘మహర్షి’ స్క్రిప్ట్‌లో భాగమైన రైటర్ సాల్మన్ ఈమధ్యే నాగ్‌కి ఓ కథ చెప్పడం, అది నాగ్‌కి నచ్చటంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడంటున్నారు. నాగ్ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయమయ్యే అవకాశం సాల్మన్‌కు దక్కింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కనుందట. నాగ్ సినిమాలు చేసుకుంటూ పోతుంటే -బంగార్రాజు ప్రాజెక్టు మీద దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాత్రం ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు.