సీమ ప్రేమ చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ1 ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీస్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా రామ్ణ్రధీర్ దర్శకత్వం వహించిన చిత్రం -రాయలసీమ లవ్‌స్టోరీ. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు జి నాగేశ్వర్‌రెడ్డి ట్రైలర్, ఆడియో బిగ్ సీడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -కర్నూలులో షూట్ చేసిన సినిమా హిట్టవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాయలసీమ లవ్‌స్టోరీ’ భారీ హిట్టుకొట్టడం ఖాయం. ట్రైలర్‌లో పూరి- రవితేజ కాంబోలో వచ్చిన ఇడియట్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. సో, ఈ సినిమాస్థాయికి తగిన ఫలితం రావాలనే ఆకాంక్షిస్తున్నా. దర్శకుడు రామ్‌లో మంచి టాలెంట్, పవర్ కనిపిస్తున్నాయి. టీంకి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాత చిన్నా మాట్లాడుతూ -రాయలసీమ అనగానే బాంబులు, ఫ్యాక్షనే గుర్తుకొస్తాయి. కానీ వాళ్ల ప్రేమెలా ఉంటుందో తెలపడానికే సినిమా నిర్మించాం. టీం హార్డ్‌వర్క్‌తో మంచి అవుట్‌పుట్ వచ్చింది అన్నారు. మరో నిర్మాత నాగరాజు మాట్లాడుతూ -సీమవాసుల అనుబంధాలు, అభిమానం ఎలా ఉంటుందో చూపించడానికే ఈ సినిమా తీశాం. అనుకున్న సమాయానికి సినిమాను పూర్తి చేసి, 27న సినిమా విడుదల చేయనున్నాం అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి ఎలేంద్ర మాట్లాడుతూ -నిర్మాతల సహకారంతో మంచి సంగీతం సమకూర్చానన్నారు. హీరోయిన్ హృశాలి మాట్లాడుతూ -ఈ సినిమా అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్. కోస్టార్స్ ఎంతో సపోర్ట్ చేశారు. టీంకి మంచి పేరొస్తుందని భావిస్తున్నా అన్నారు. హీరో వెంకట్ మాట్లాడుతూ -వలి లేకుంటే సినిమానే ఉండేది కాదు. డైరెక్టర్ రామ్ నాకు ఫ్రెండ్. లైన్ అనుకున్నప్పటి నుంచీ నేనే హీరోగా ఫిక్సయ్యాడు. నా కెరీర్‌ను ఎక్కడికో తీసుకళ్లే సినిమా ఇది. కొత్తవాళ్లని కూడా చూడకుండా మంచి అవుట్‌పుట్ కోసం శ్రమించిన నిర్మాతల కృషి ఎప్పటికీ మరువలేం అన్నారు. దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ -సినిమా మొదటినుంచి మాకు అన్నివిధాలా ప్రోత్సహించిన జి నాగేశ్వర్‌రెడ్డికి రుణపడి ఉంటా. లైన్ చెప్పగానే పది రోజుల్లోనే షూటింగ్ మొదలుపెట్టించారు నిర్మాతలు. ఒకవిధంగా లైఫ్ ఇచ్చారు. కథానుగుణంగానే -రాయలసీమ లవ్‌స్టోరీ టైటిల్ పెట్టాం. ఓ మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉంది అన్నారు.