సంగీతభరిత ప్రేమకథగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా సంచలన విజయం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించనున్న సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఆన్ లొకేషన్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకుడు శేఖర్‌కమ్ముల, నాగచైతన్య, సాయిపల్లవి, నిర్మాతలు సునీల్‌దాస్ కె నారంగ్, ఎఫ్‌డిసి ఛైర్మన్ పి రామ్మోహన్‌రావు, భరత్ నారంగ్, కోప్రొడ్యూసర్ విజయ్‌భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఏసియన్ గ్రూప్స్ అధినేత సునీల్‌నారంగ్ దర్శకుడు శేఖర్ కమ్ములకు స్క్రిప్ట్ అందించారు. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్ ఇవ్వగా, డిస్ట్రిబ్యూటర్ సదానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్‌దాస్ కె నారంగ్, పి రామ్మోహన్‌రావు నిర్మిస్తోన్న మ్యూజికల్ లవ్ స్టోరీ -నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ సీన్‌తో మొదలైంది. నిర్మాత పి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ -శేఖర్ డైరెక్షన్‌లో సినిమా నిర్మిస్తుండటం హ్యాపీగా ఉంది. మూడు షెడ్యూళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం మొదలైన షెడ్యూల్ పది రోజులు నిర్వహిస్తాం. ఓ మంచి మ్యూజికల్ లవ్ స్టోరీని శేఖర్ తెరపై ఆవిష్కరించనున్నాడు అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ -విలేజ్‌నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలనుకునే ఇద్దరి మధ్య సాగే ప్రేమ కథ ఇది. ఫస్ట్‌టైం ఒక మ్యూజికల్ లవ్ స్టోరీలో నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగచైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నాడు. నాగచైతన్య పాత్ర సినిమాకు హైలెట్. సాయిపల్లవి కథకు పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నా సినిమాల్లో మ్యూజిక్ బలంగా ఉంటుంది. ఇందులో ఆ బలం మరింతగా కనిపిస్తుంది. రెహ్మాన్ స్కూల్ నుంచి వచ్చిన పవన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అన్నారు. మిగతా తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.