అందమైన విలన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్ పేరెత్తగానే గుర్తుకొచ్చే సినిమా -కుమారి 21ఎఫ్. తొలి ప్రాజెక్టుతో సంపాదించుకున్న క్రేజ్‌ను -తరువాత చేసిన చిత్రాల్లో నిలబెట్టుకోలేకపోయింది హెబ్బా. గ్లామర్ పాత్రల్లో గట్స్ చూపించినా -ఎంచుకున్న కథల్లో విషయం లేక పూర్తిగా వెనకబడిపోయింది. కొత్త హీరోయిన్ల రేసులో అడ్రెస్ లేనంత వెనకబడిపోయిన హెబ్బా -తాజాగా ఓ పెద్ద సినిమాలో చాన్స్ దక్కించుకుందట. హీరోయిన్ రేసులో వెనకబడటంతో స్ట్రాటజీ మార్చి -విలన్ క్యారెక్టర్ చేస్తోందని అంటున్నారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న ‘్భష్మ’ చిత్రంలో -హెబ్బా వైవిధ్యమైన విలన్ రోల్ పోషించనున్నట్టు తెలుస్తోంది. నితిన్ సరసన రష్మిక జోడీ కడుతోంది. కథలోని లేడీ విలన్ క్యారెక్టర్ కీలకం కావటంతో -ఆ పాత్రకు హెబ్బా అప్పియరెన్స్ సరిపోతుందని చిత్రబృందం అప్రోచ్ కావడం, నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌కు ఆమె ఓకే చెప్పడం జరిగిందని తెలుస్తోంది. హెబ్బా పెర్ఫార్మెన్స్ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు కనుక -విలనీ రోల్‌కు ఆమె ప్రాణం పోయగలదనే అంటున్నారు. సరికొత్త క్యారెక్టర్ -ఆమె కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.