స్టయిల్ మార్చి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రీమేక్‌ను రీ బిగినింగ్‌గా ప్రకటించుకున్న హీరో -బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆ రీమేక్ సినిమా -రాక్షసుడు. అల్లుడుశీను తరువాత అరడజను ఫ్లాపులతో విసిగిపోయిన సాయి శ్రీనివాస్ -రాక్షసుడి చిత్రాన్ని రీబిగినింగ్గా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే ప్రదర్శించిన నమ్మకం నిజమై -అతని కెరీర్లో భారీ హిట్టేపడింది. క్రైమ్‌థ్రిల్లర్‌గా వచ్చిన రీమేక్ రాక్షసుడులో సెటిల్డ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌తో మంచి మార్కులు కొట్టేశాడు బెల్లంకొండ. ఆ సినిమా -కెరీర్‌కూ కొత్త ఊపునిచ్చింది. వరస సినిమాలతో అలసిపోయి, రాక్షసుడు హిట్టిచ్చిన ఆనందంలో నెలపాటు ఫారిన్ ట్రిప్వేసిన సాయి -కొత్త ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడట. కథలపై ప్రత్యేకమైన శ్రద్ధపెడతానంటూ ముందే ప్రకటించిన విధంగా -రీ బిగినింగ్ రెండో ప్రాజెక్టును తన స్టయిల్‌కు భిన్నమైన ప్రాజెక్టుకు రెడీ అయ్యాడని అంటున్నారు. సినిమా చూపిస్తమామ, నేనులోకల్, హరోగురూ ప్రేమకోసమే..లాంటి చిత్రాలను తెరకెక్కించిన నక్కిన త్రినాథరావుకు సాయి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసేలా హీరో పాత్రని ఆవిష్కరించే త్రినాథరావుతో, అతని స్టయిల్ కథని చేసేందుకు ఓకె చెప్పాడని అంటున్నారు. అయితే, ప్రాజెక్టు ఎంతవరకూ నిజమన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.