భయపెట్టడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు మర్డర్ మిస్టరీలో లాకై -దాన్ని ఎలా ఛేదించాడు? ఎలా బయటపడ్డాడు అన్నదే -దర్పణం. సెకెండాఫ్‌లో ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది అంటున్నాడు హీరో తనిష్క్ రెడ్డి. ఎలక్సియస్, శుభాంగిపంత్ హీరోయిన్లుగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ -దర్పణం. సెప్టెంబర్ 6న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హీరో తనిష్క్ మీడియాతో మాట్లాడాడు.

హీరోగా సకలకళావల్లభుడుతో పరిచయమయ్యాను. దర్పణం రెండో సినిమా. అంతకుముందు -ఆ ఐదుగురు, దునియా, చక్కిలిగింత చిత్రాల్లో మంచి పాత్రలు చేశాను. ఆర్య సినిమా చూశాక హీరో అవ్వాలన్న కోరిక కలిగింది. ఓ హీరోకి కావాల్సిన అన్ని యాక్టివిటీస్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా.
తొలి సినిమా తరువాత ఆఫర్ల కోసం ఎదురు చూడక తప్పలేదు. ఓ సినిమా తీద్దామని అనుకుంటున్నా అంటూ ఆర్‌కె ఇంటర్వెల్ సీన్ చెప్పాడు. అది నచ్చి కథ వినకుండానే ఓకే చెప్పేశాను. సినిమాలో సెల్లార్ ఎపిసోడ్ ఆడియన్స్‌కి పిచ్చ కిక్కెచ్చే సీన్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సతీష్ ముత్యాల కెమెరా సినిమాకు అదనపు అస్సెట్స్.
రామకృష్ణ యంగ్ డైరెక్టర్ అయినా సినిమాను అద్భుతంగా క్యారీ చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడకుండా బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేవరకు కష్టపడ్డాడు. సినిమాలోని మర్డర్ మిస్టరీకి సంబంధించిన క్లూ అద్దంలో కనిపిస్తుంది కనుక -దర్పణం టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ హారర్ కచ్చితంగా ఆడియన్స్‌ని భయపెడుతుంది.
వైజాగ్ బీచ్, అరకు, హైదరాబాద్ రోడ్ నెం 45లోని ఒక బంగ్లాలో ఎక్కువ భాగం షూట్ చేశాం. మంచి టెక్నీషియన్స్ కనెక్టయితే -తక్కువ బడ్జెట్‌లో ఎంత క్వాలిటీ సినిమా తీయొచ్చో దర్పణం ఓ ఎగ్జాంపుల్. అబి అనే నెగెటివ్ క్యారెక్టర్ బాగుంటుంది. అలెక్సిస్, శుభాంగిపంత్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
క్రైమ్ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నా. ఒక లవ్‌స్టోరీ, మరో సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉన్నాయి. మూడూ మంచి కంటెంట్‌వున్న కథలే. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది.