సరికొత్త ప్రేమకథ నీకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఆర్టిస్టులు, నిజజీవిత సంఘటనలతో నిర్మించిన ప్రేమకథా చిత్రం -నీకోసం. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణపొందాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగీత దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ -ప్రతి ఒక్కరి జీవితంలో ఏదోక సంఘటన ఈ సినిమాలో ఏదోక సీన్‌కి కనెక్టవుతుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. హీరో అరవింద్ రెడ్డి మాట్లాడుతూ -ఈ సినిమా నా ఫ్యామిలీ సపోర్టుతో చేశా. నా సహోదరి నాకు అండగా నిలబడింది. దర్శకుడు నా స్నేహితుడు. సినిమా కథ అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ కాపీ చూసేవరకు అంతే నమ్మకంతో పనిచేశాం. అనుకున్నదానికంటే బాగా కథను తెరమీద చూపాడు దర్శకుడు. ఒక మంచి ప్రేమకథ చూసిన ఫీల్ తప్పకుండా వుంటుందన్నాడు. స్టోరీకి నేను బాగా కనెక్టయ్యాను. రెగ్యులర్ స్టోరీలాకాకుండా యూత్‌కి బాగా కనెక్టయ్యే కథ అన్నారు మరో హీరో అజిత్ రాధారామ్. హీరోయిన్లు శుభాంగి పంత్, దీక్షితా పార్వతి మాట్లాడారు. దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ -మనిషి పోయాక చాలా ప్రేమ చూపెడతారు. కానీ ఉన్నప్పుడే ఆ ప్రేమను పంచుకుంటే జీవితం చాలా బాగుండేది. అదే నీ కోసం సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాము అన్నారు.