సైరాపై.. ‘స్పై’!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా విడుదలపై సందిగ్ధ కథనాలు కొనసాగుతుండటంతో -దసరా వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ థియేటర్లు వెతుక్కుంటున్నాయి. ఒక మీడియం, మరో చిన్న సినిమా. సీనియర్ హీరో చిరంజీవినుంచి 151వ ప్రాజెక్టుగా రానున్న సినిమా -సైరా. కొణిదెల ప్రొడక్షన్స్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సినిమాను అక్టోబర్ 2న థియేటర్లకు తేవాలనుకున్నారు. భారీ బడ్జెట్ సినిమా కనుక -బాలీవుడ్‌లోనూ పెద్దఎత్తున విడుదలకు నిర్ణయించారు. అదే తేదీలో బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా -వార్ విడుదలవుతోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంది వార్. అటు బాలీవుడ్‌తోపాటు -తెలుగులోనూ సినిమాను భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఒకే తేదీన రెండు సినిమాలొస్తే -బాలీవుడ్‌లో ‘సైరా’కు, టాలీవుడ్‌లో ‘వార్’కు ముప్పుతప్పదు. ‘వార్’కు టాలీవుడ్‌పై పెద్దగా ఫోకస్ లేదు కనుక, అక్టోబర్ 2 డేట్‌నుంచి వెనక్కి జరిగే అవకాశం కనిపించటం లేదు. కానీ, సైరా చిత్రబృందం బాలీవుడ్‌పైనా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో -్ధర్యంగా సినిమాను విడుదల చేస్తుందా? వారంపాటు వెనక్కి జరుగుతుందా? అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఒకవేళ ప్రకటించుకున్న తేదీకే ‘సైరా’ విడుదలైతే -ఆ తేదీకి వచ్చే చిన్న సినిమాలు ఎంతవరకూ నిలబడతాయన్నది సందేహమే. ఇలాంటి పరిస్థితుల్లోనూ గోపీచంద్ ‘చాణక్య’, ఓకార్ హారర్ కామెడీ ‘రాజుగారి గది 3’ సినిమాలు దసరాను టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజుగారి గది 3 చిన్న బడ్జెట్‌తోనే నిర్మితమైనా -సీక్వెన్స్‌కు ఓ ఇమేజ్ ఉంది కనుక దానిపై చిత్రబృందం ఆశతోనే ఉంది. పెద్ద సినిమాతో పోటీపడగల చిత్రంగా భావించినా, దెబ్బ తగిలితే తట్టుకోవడం కష్టం కాకపోవచ్చు. ఇక గోపీచంద్ సైతం ‘సైరా’కు పోటీగా దసరా రేసులో సినిమాను నిలబెట్టాడు. గోపీచంద్ మార్కెట్ స్టామినాకు మించే బడ్జెట్ పెట్టి తీస్తోన్న సినిమా చాణక్య. వరుస ఫ్లాపులతో మార్కెట్ దెబ్బతిన్న గోపీచంద్‌కు సోలో రిలీజ్ అవసరం ఎంతోవున్నా, సైరాను లెక్క చేయకుండా థియేటర్లకు రావాలనుకోవడం సాహసమే అంటున్నారు. అయితే ‘వార్’తో తలెత్తే క్లాష్ కారణంగా సైరా కనుక వెనక్కి జరిగితే -ఆ స్లాట్ చాణక్యకు కలిసొచ్చే అంశమే కావొచ్చు. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన చాణక్యలో గోపీచంద్ స్పై క్యారెక్టర్ చేశాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. టాకీపార్ట్ పూర్తవడంతో, ఇటలీ, మిలాన్‌లలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అవుట్‌పుట్ బాగా రావడంతో -చిత్ర నిర్మాత అనిల్ సుంకర ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సైరా ఫైనల్ డెసిషన్ ఎవరికి లాభిస్తుందో, ఎవరికి నష్టం చేస్తుందో చూడాలి.