కనుపాపే.. కడలై పొంగినదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక అరుల్ మోహన్ ముగ్దమనోహర రూపాన్ని చూసి హీరో నాని మాటలు తడబడుతున్నాడు. ‘రైటర్నైవుండి, నాకే చెప్పటానికి మాటలు రావడం లేదు. అసలు అమ్మాయి ఇంతందంగా ఉండకూడదు. క్రైమ్ తెలుసా?’ అంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఇదంతా నానీస్ గ్యాంగ్‌లీడర్ సినిమా సీన్. నాని- విక్రమ్‌కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం -నానీస్ గ్యాంగ్‌లీడర్. సెప్టెంబర్ 13న సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అనిరుథ్ సంగీతం సమకూర్చిన సినిమా నుంచి రెండో సిగిల్‌ను బయటకు వదిలారు. ‘నినుచూసే ఆనందంలో.. కనుపాపే కడలై పొంగినదే’ అంటూ అనంత్‌శ్రీరామ్ రాసిన, సిధ్‌శ్రీరామ్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రంలో ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషిస్తుంటే, ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రయదర్శి, రఘుబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.