రాగల 24 గంటల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈషారెబ్బా, సత్యదేవ్ జంటగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం -రాగల 24 గంటల్లో. నవహాస్ క్రియేషన్స్, కార్తాకేయ సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. తాజాగా టైటిల్ మోషన్ పోస్టర్‌ను దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -చిన్నప్పుడు రేడియోలో వచ్చే వాయిస్‌ను గుర్తు చేస్తుంది టైటిల్. మంచి స్క్రిప్ట్ దొరికితే, దాన్ని ఎంత బాగా సినిమాగా మలచుకొవచ్చో ఢమరుకం సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్‌ని చాలా ఇష్టపడతాను. సంగీత దర్శకుడు రఘు కుంచె మ్యూజిక్ బావుంటుంది. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరుకు మంచి అవకాశం ఉంది. సినిమా మంచి విజయం సాధించి నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ -వినాయక్ చేతులమీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది. ఇంతకుముందు నేను చేసిన చిత్రాల ఫస్ట్‌లుక్, ఆడియో ఆయన చేతుల మీదుగానే లాంచ్ అయ్యాయి. అది నా సెంటిమెంట్. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్‌పుట్ తేవడానికి నిర్మాత అందించిన సహకారం మర్చిపోలేను. అందుకు కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత శ్రీనివాస్ కానూరి మాట్లాడుతూ -నిర్మాతగా నా తొలి సినిమా. మంచి సినిమా తీశానన్న ప్రశంసలు ఆడియన్స్‌నుంచి ఆశిస్తున్నా అన్నారు.