అభినయ మయూరి.. జయసుధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవార్డులు రాకపోయినా ఫర్వాలేదు కానీ అది వస్తే మనసు చాలా సంతోషంగా వుంటుంది. అవార్డు అనేది నటులు చేసిన పనికి ఓ గుర్తింపు. నంది అవార్డులను రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో పక్కన పెట్టేశాయి అని టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా జయసుధకు ‘అభినయ మయూరి’ అనే అవార్డు ప్రదానం చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. విశాఖపట్నంలో ఈనెల 17న జరగనున్న కార్యక్రమంలో జయసుధకు ఈ అవార్డును ఇవ్వనున్నట్లుగా ఆయన తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును ప్రదానం చేస్తోందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఏ పేరుతో ఇస్తారో తెలపాలని, అందుకు ఏవిధమైన వనరులు కావాలన్నా తాము ముందుంటామని ఆయన తన అభిప్రాయం వ్యక్తంచేశారు. 20 ఏళ్ళనుండి ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సినీ రంగానికి చెందిన ఎంతోమందిని గౌరవిస్తున్నామని, ఆమెది 46 ఏళ్ళ కెరీర్ అని ఆయన గుర్తుచేసుకున్నారు. సినిమా కళను తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదని, అనేక శాఖలను తనలో ఇముడ్చుకున్న గొప్ప కళ అని తెలిపారు. మహానటి అంటే ఒక్కరే వున్నారని అనుకుంటారని, చక్కగా నటించే ఎవరైనా మహానటులేనని, అలా నటించకపోతే ఇక్కడ ఉండలేమని నటి జయసుధ తెలిపారు. సుబ్బరామిరెడ్డి ఓ మంచినటి అయిన జయసుధకు ఈ అవార్డు ప్రకటించడం ఆనందదాయకంగా వుందని అలనాటి నటి జమున వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.