డిస్కోరాజా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం -డిస్కోరాజా. వినాయక చవితి సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. సెప్టెంబర్ 3నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ -్ఫస్ట్‌లుక్ రవితేజ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చేలా ఉందనుకుంటున్నా. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీహంగులు, గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నాం. తమన్ మ్యూజిక్, అబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్లు. వెనె్నల కిషోర్ కామెడీ, బాబీ సింహ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి అన్నారు.