రాజుగారి గది- 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుగారి గది -సిరీస్‌లో భాగంగా ఓంకార్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం రాజుగారి గది 3. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్ దర్శకుడు వివి వినాయక్ చేతులమీదుగా విడుదలైంది. షబీర్ సంగీతం అందిస్తున్న చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిత్రం రూపొందుతోంది. ఫస్ట్‌లుక్ విడుదల సందర్భంలో వివి వినాయక్ మాట్లాడుతూ -ఓంకార్ కష్టపడి చేస్తున్న సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. దర్శక నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ -రాజుగారి గది సినిమా చేసేటప్పుడు సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. అప్పట్లో వినాయక్ చేతులమీదుగా వినాయక చవితి రోజునే టీజర్ విడుదల చేశాం. దాని దశ మారిపోయింది. నాలుగేళ్ల తరువాత మళ్లీ ఇపుడు వినాయక్ చేతులమీదుగా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. గత చిత్రాలకంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకముంది. అన్నీ కుదిరితే దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు.