6న 2 అవర్స్ లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ నిర్మాణంలో శ్రీపవార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సరికొత్త ప్రేమ కథా చిత్రం -2 అవర్స్ లవ్. కృతిగార్గ్ హీరోయిన్. 6న సినిమా విడుదలవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ టికెట్ విడుదల చేశారు. కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గ్యానిసింగ్ మాట్లాడుతూ -టీమ్ అంతా కొత్తవాళ్లే. శ్రీపవార్ హీరోగా చేస్తూనే దర్శకుడిగా సినిమా చక్కగా తెరకెక్కించాడు. మంచి సంగీతం కుదిరింది. సినిమా అందరికీ నచ్చుతుంది అన్నాడు. హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ -బ్యూటీఫుల్ అండ్ అమేజింగ్ లవ్‌స్టోరీ 2 అవర్స్ లవ్. ఈ సినిమాతో నా టాలీవుడ్ జర్నీ మొదలైంది. అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. దర్శక, హీరో శ్రీపవార్ మాట్లాడుతూ -2012లో పాయింట్ అనుకున్నాం. 2016లో కథ రాశాను. నేనెక్కడా దర్శకత్వ శాఖలో పని చేయకపోవడంతో, వెంటనే అవకాశం రాలేదు. చివరకు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారంతో సినిమా తెరకెక్కించా. సహకరించిన ఆర్టిస్టులు, టెక్నికల్ టీం అంతటికీ కృతజ్ఞతలు. కంటెంట్‌వున్న సినిమాలు హిట్టవుతాయన్నది నా నమ్మకం. ఆదరించాలని ఆడియన్స్‌ని కోరుకుంటున్నా అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ -టైటిల్, ఆర్టిస్టుల స్క్రీన్ ప్రెజన్స్ బావుంది. గ్యానీ మంచి ట్యూన్స్‌ఇచ్చారు. శ్రీపవార్‌లో క్లారిటీ ఉంది. 2 అవర్స్ లవ్ చిత్రానికి డబ్బులతోపాటు యూనిట్‌కి మంచి పేరురావాలని కోరుకుంటున్నా అన్నారు.