బన్నీ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురములో ఇలా కనిపిస్తానంటూ -ఫస్ట్ లుక్‌ని ఇచ్చేశాడు హీరో అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకుడిగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం -అల.. వైకుంఠపురములో. బన్నీ కెరీర్‌లో ఇది 19వ ప్రాజెక్టు. దర్శకుడు త్రివిక్రమ్‌తో మూడో సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో హిట్టుకొట్టిన ఇద్దరూ -ఈ ప్రాజెక్టుతో హ్యాట్రిక్ అందుకుంటారా? అన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో -బన్నీతో మరోసారి పూజా హెగ్దె జోడీ కడుతోంది. నివేతా పేతురాజ్, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఎస్‌ఎస్ థమన్ సమకూరుస్తుంటే, సినిమాటోగ్రఫీని పిఎస్ వినోద్ సమకూరుస్తున్నారు.