కమాన్ బోయ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రథం ఫ్రేమ్ గీతానంద్, శ్రీహాన్, రోనిత్‌రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ హీరో హీరోయిన్లుగా శ్రీపిక్చర్స్ బ్యానర్‌పై బోయ్స్ సినిమా ప్రారంభమైంది. దర్శకుడు దయానంత్ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని నేహా శర్మ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశంలో కెఎల్ దామోదర్ ప్రసాద్ క్లాప్‌కొట్టి దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. నిర్మాత రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత సుప్రియ, నిర్మాత రాహుల్ యాదవ్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ -ఇదొక న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్. కథ విన్నవెంటనే నిర్మాతలు సినిమా చేయడానికి ఓకే అన్నారు. మంచి టీం కుదరటం హ్యాపీగా ఉంది అన్నాడు. నిర్మాత నేహా శర్మ మాట్లాడుతూ -లవ్ ఎంటర్‌టైనర్‌గా బోయ్స్ సినిమా తెరకెక్కనుంది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తున్నాం. టాకీ హైదరాబాద్‌లో పూర్తి చేసి, పాటల్ని గోవాలో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 4నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు.