మిస్ ఇండియా మురిపిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా ప్రాధాన్యతా చిత్రాలు.. ముఖ్యంగా హాస్య ప్రధానాంశ సినిమాలకు సక్సెస్ గ్రాఫ్ తక్కువ. చాలామంది హీరోయిన్లు ప్రయోగాలు చేసి బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. మహిళా ప్రాధాన్యతా సినిమా అనగానే ఒకప్పుడు విజయశాంతి, తరువాత అనుష్కశెట్టి ఇలా ఏ కొద్దిమంది పేర్లో వినిపిస్తుంటాయి. తమన్నా, తాప్సీ, అమలాపాల్‌లాంటి బ్యూటీలూ ప్రయోగాలు చేసినా -సక్సెస్ రేటు హారర్ కామెడీలకే పరిమితమైంది. ఈ సెంటిమెంట్‌ను -ఇటీవల వచ్చిన ‘ఓ బేబీ’తో సమంత చెరిపేసింది. డ్రామాను సరిగ్గా డిజైన్ చేస్తే -సినిమా సక్సెస్‌వైపు ప్రయాణిస్తుందన్న విషయాన్ని రుజువుచేసింది. అయితే, ఈ సక్సెస్ వెనుక సమంత స్టామినాయే ఎక్కువ. ఆడియన్స్ చిటికెన వేలు పట్టుకుని -కథలోకి, పాత్రల గుండెల్లోకి తీసుకెళ్లగలిగే పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టిందనటంలో సందేహం లేదు. ఇకపై అలాంటి చాన్స్‌లు కీర్తి సురేష్‌కు దక్కుతాయా? అనిపిస్తోంది. కీర్తి చేస్తోన్న తాజా ప్రాజెక్టు మిస్ ఇండియా. ఏమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సునిశితమైన కామెడీ కథే --మిస్ ఇండియా. ‘మహానటి’గా జాతీయ అవార్డు ఇమేజ్ మోస్తున్న కీర్తి, అనూహ్యంగా మోడ్రన్ అప్పియరెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టామినా చూపిస్తే.. కీర్తికి సెపరేట్ ట్రాక్ పడినట్టే. తల్లి కావాలన్న కోరికతో సమంత రెండేళ్ల విశ్రాంతికి సిద్ధమవుతోన్న తరుణంలో -కామెడీ టైమింగ్ పాత్రలు కీర్తికి దక్కే అవకాశాలు ఉండొచ్చు.