బయోగ్రఫీకి క్లైమాక్స్ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్రతిహత విజయాలతో పీవీ సింధు ముందుకు సాగుతుంటే -ఆమె స్క్రీన్ స్టోరీలో క్లైమాక్స్ ఏంరాయాలో అర్థంకాక చిత్రబృందం దిక్కులు చూస్తుంది. భారత మహిళా బ్యాడ్మింటన్‌కు సైనానెహ్వాల్ ఏకైక దిక్కు అనుకుంటున్న తరుణంలో -అనూహ్యంగా దూసుకొచ్చిన మెరుపుతునకే పీవీ సింధు. అప్పుడెప్పుడో ప్రకాశ్ పదుకొనె సాధించిన అసాధ్య రికార్డులను సింధు అనూహ్యంగా తిప్పి రాస్తుండటంతో -ఆమె బయోగ్రఫీలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మూడేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో భారత ఖాతాలోకి రజతాన్ని చేర్చటంతో -పీవీ సింధుపై ఫోకస్ పెరిగింది. ఆ టైంలోనే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ -లేడీ షట్లర్ స్టోరీని తెరకెక్కించాలన్న నిర్ణయానికి వచ్చాడు. తరువాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు మరో రెండు రజతాలు వరుసగా సాధించటంతో -కథలో క్లైమాక్స్ మార్చుకున్నారు. మూడేళ్లు నడిపించిన స్క్రిప్ట్‌ను లాక్ చేస్తోన్న తరుణంలో -తాజాగా పసిడి పతకాన్ని సాధించటం కథకు కొత్త ట్విస్ట్. తాజా రికార్డునే క్లైమాక్స్ చేయనున్నట్టు సోనూసూద్ చెబుతున్నా -సింధు విజయపరంపరకు ఫుల్‌స్టాప్ పెట్టగలమా? అన్న సందేహాలూ చిత్రబృందాన్ని వెంటాడుతున్నాయి. పైగా -ప్రపంచ బ్యాడ్మింటర్ చాంపియన్‌షిప్‌లో ప్రత్యర్థికి చానే్స లేకుండా సునాయాస విజయం సాధించటం సింధు స్టామినాకు పరాకాష్ట. ప్రతిఘటన లేని క్లైమాక్స్‌ను ఉత్కంఠగా చూపించటం కష్టంకావొచ్చన్న ఆలోచన చిత్రబృందాన్ని వెంటాడుతోంది. సింధు వేగాన్ని చూస్తుంటే -వచ్చే ఒలింపిక్స్‌లో పసిడి కొల్లగొట్టడం ఖాయమన్న పరిస్థితీ లేకపోలేదు. అప్పటికి సినిమా సిద్ధమైపోతే -పరిస్థితి ఏంటన్న ఆలోచనా తెరపైకి వస్తోంది. సో, ఒలింపిక్స్ ముగిసే వరకూ సింధు స్క్రిప్ట్‌ను లాక్‌చేసే అవకాశమే లేదన్నది తాజా మాట. ఇక -బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ బయోగ్రఫీలోనూ సింధు విజయం క్లైమాక్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది. కోచ్ గోపీచంద్ పాత్రను సుధీర్‌బాబు చేస్తుంటే, ప్రవీణ్ సత్తారు ఈ బయోగ్రఫీని తెరకెక్కిస్తున్నాడు. షట్లర్‌గా సింధు పసిడి పరుగు వెనుక గోపీచంద్ పాత్రను తక్కువ చేయలేం. అనితరసాధ్యమైన విజయంవైపు అడుగులేయించిన కోచ్‌గా గోపీచంద్ బయోగ్రఫీకి క్లైమాక్స్ అదే కావొచ్చు. సో, దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎలాంటి క్లైమాక్స్‌ను డిజైన్ చేస్తాడన్నది వెండితెరపై చూడాలి.