పోర్టోపై వార్ సీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ -వార్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బ్యాంగ్ బ్యాంగ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. రెబెల్ ఆర్మీ అధికారి కబీర్‌గా హృతిక్ రోషన్, అతన్ని మట్టుబెట్టేందుకు ప్రయత్నించే మరో సైనికాధికారి ఖలీల్ పాత్రలో టైగర్ ష్రాప్ నటిస్తున్నారు. యుద్ధవిద్యల్లో టైగర్‌కు శిక్షణనిచ్చిన గురువు హృతిక్ అన్నది ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో చెప్పకనే చెప్పారు. గురుశిష్యుల మధ్య తలెత్తే సవాళ్లు, వాటి కారణంగా వచ్చే పోరాట సన్నివేశాలను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు చిత్రబృందం చెబుతోంది. వార్ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఏడు దేశాల్లో.. పదిహేను ప్రఖ్యాత పట్టణాల్లో చిత్రీకరించారు. పోర్చుగల్‌లోని అతి పెద్ద పోర్టో బ్రిడ్జిపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించి ఓ సాహసమే చేశామంటున్నాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. చరిత్రలో ఎప్పుడూ లేనిది, ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రెండు రోజులపాటు బ్రిడ్జిని బంద్ చేశారు. స్థానిక అధికారుల సహకారంతోనే ఈ సాహసం పూర్తి చేయగలిగామని దర్శకుడు ఓ ట్వీట్‌లో వెల్లడించాడు. ఉత్కంఠ రెకెత్తించే ఈ సన్నివేశం వార్ సినిమాకు హైలెట్ కానుందట. బాలీవుడ్‌లో ఈ ఏడాదిలోనే అతి పెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోన్న వార్ -యాక్షన్ లవర్స్‌ను పూర్తిగా సంతృప్తిపర్చగలదన్న నమ్మకంతో ఉంది చిత్రబృందం. విజువల్ స్పెక్టాకిల్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రంలో హృతిక్‌కు జోడీగా వాణీకఫూర్ కనిపించనుంది. బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అక్టోబర్ 2 గాంధీజయంతికి సినిమా విడుదల కానుంది.