అరె.. మనోజ్ మారిపోయాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడియన్స్‌కి కొత్త థ్రిల్ ఇవ్వాలంటే -పాత ఇమేజ్‌ని చెరిపేయాలి. చాలామంది హీరోలు చేసే పనే. మంచు మనోజ్ కూడా అదే ఫాలో అయిపోయాడు. బరువు తగ్గి బాడీని మార్చుకున్నాడు. తనలోని మార్పుని చూపించేందుకు సన్నద్ధమవుతున్నాడు. నిజానికి మనోజ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతుంది. సినిమాలకు దూరంగావుంటున్నా, ట్విటర్ వేదికగా టచ్‌లోనే ఉన్నాడు. వరుస ఫ్లాపులతో విసిగిపోయిన కారణంగా -్భరీ బ్రేక్ తీసుకున్న మనోజ్, ఆ టైంలో బాడీ షేప్‌పై గట్టిగానే దృష్టిపెట్టాడు. శరీరాకృతిని మార్చుకోడానికి ఎంత కష్టపడ్డాడన్నది ఫొటో చూస్తే అర్థమవుతుంది. బాగా బరువుతగ్గి మారిన బాడీ షేప్‌తో -కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. మంచి పెర్ఫార్మర్ అయిన మనోజ్ -వరుస ప్రాజెక్టుల్ని ఒకేసారి ప్రకటించే అవకాశం లేకపోలేదన్న మాటా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు టైం కలిసొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. స్క్రీన్‌మీద సరికొత్త ప్రజెన్స్ కోసం తనను తను మార్చుకున్న మనోజ్ -మంచి టైమింగ్‌తో ఆడియన్స్ ముందుకొస్తాడేమో చూద్దాం.