క్రిస్మస్‌కి.. కిరికిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు గ్యాంగ్‌లీడర్. ఇటు వాల్మీకి. రెండు ఆడియన్స్‌లో ఆసక్తిరేపిన చిత్రాలే. రెండూ ఒకేసారి థియేటర్లకు వస్తే -ఏదోక సినిమా నష్టపోయే ప్రమాదం ఉండొచ్చు. సో, సమన్వయంతో వ్యవహరించి ఒక సినిమాకు వెనక్కి జరుపుకుంటే మంచిదన్న ప్రతిపాదన నిర్మాతల ముందుకొచ్చింది. వారం అటూ ఇటూ వస్తే ఇబ్బందేముందున్న సమన్వయ ఆలోచనతో -వాల్మీకి వారం వెనక్కి జరిగాడు. సో, సెప్టెంబర్ 13న లోడెడ్ రివేంజ్ ఫన్‌తో నానీస్ గ్యాంగ్‌లీడర్ థియేటర్లకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వరుణ్‌తేజ్ -హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ వాల్మీకి సెప్టెంబర్ 20న థియేటర్లకు రానున్నాడు. సినిమాల పరంగా సెప్టెంబర్ రెండు, మూడు వారాలు అన్‌సీజన్ కనుక ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే, ఇదే తలనొప్పి వ్యవహారం క్రిస్మస్ సినిమాలకు ఎదురయ్యేలా ఉంది. క్రిస్మిస్ సీజన్‌మీద నమ్మకంతో -డిసెంబర్ 20న థియేటర్లకు వస్తున్నట్టు నాలుగు సినిమాలు ప్రకటించుకున్నాయి. అవి -రవితేజ ‘డిస్కోరాజా’, నితిన్ ‘్భష్మ’, సాయిధరమ్‌తేజ్ ‘ప్రతిరోజు పండగే’, శర్వానంద్ ‘96’. పోస్ట్ ప్రొడక్షన్స్ దశకు చేరుకున్న నాలుగు సినిమాలూ అప్పటికి పూరె్తైపోతాయి. క్రిస్మస్‌ను టార్గెట్ చేస్తూ నాలుగు సినిమాలూ థియేటర్లను వెతుక్కోవాల్సి వస్తే మాత్రం -ఇబ్బంది తప్పదు. ఆడియన్స్ బడ్జెట్‌కు అనుగుణంగా సినిమాలు చూస్తారు కనుక -ప్రాధాన్యతాక్రమంలో కనీసం రెండు సినిమాలకు అన్యాయం జరిగే పరిస్థితి రావొచ్చు. సో, కనీసం రెండు సినిమాలైనా వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. సినిమాలన్నీ అల్లు అరవింద్, దిల్‌రాజ్‌లాంటి పెద్ద నిర్మాతల ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి వస్తున్నవే కనుక -ఎవరు రాజీపడతారో, ఎవరు మొండిగా ముందుకెళ్తారోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టున్న స్లాట్ నుంచి -ఏయే సినిమాలు ఏ సినిమాలకు దారిచ్చేస్తాయో చూడాలి. వాయిదాకంటూ సిద్ధపడితే -ఆ సినిమాకు జనవరి చివరి వారంలోగానీ అనుకూలమైన స్లాట్ దొరికే అవకాశం కనిపించటం లేదు. సో, అంతా పూరె్తైనా పెద్దపండగ దాటే వరకూ ఆగే సినిమాలేంటో కాలమే నిర్ణయించాలి.