6న తారామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రలుగా దర్శకుడు రామ్ తెరకెక్కించిన తమిళ సినిమా -తారామణిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డివి వెంకటేష్, ఉదయ్‌హర్ష వడ్డెల్ల సంయుక్తంగా అందిస్తున్నారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదల నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత కెయల్ దామోదరప్రసాద్ మాట్లాడుతూ -ట్రైలర్ చూశాక ఇదొక రియలిస్టిక్ ఫిల్మ్ అని అర్థమైంది. మనం బయటకు చెప్పుకోలేని ఎన్నో ఎమోషన్స్‌ని ఇప్పటి సినిమాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. తప్పక విజయం సాధిస్తుంది. నిర్మాత వెంకటేష్ స్ట్రెయిట్ సినిమాలు కూడా చేస్తాడని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత డీవీ వెంకటేష్ మాట్లాడుతూ -తమిళంలో ఇది హిట్టు సినిమా. రీమేక్ చేద్దామనుకున్నా కుదరలేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిత్రాన్ని అనువదించాం. ఆండ్రియా బాగా సపోర్ట్ చేశారు. తెలుగు ఆడియన్స్‌కి నచ్చే సినిమా’ అన్నారు. నిర్మాత ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ -ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎమోషనల్ కంటెంట్‌తోపాటు అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉంటాయి. సమాజంలో స్ర్తిలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా సాగుతుంది. టెక్నాలజీ మాయలపడిన యువత ఎలాంటి పర్యావసానాలు ఎదుర్కొంటున్నారన్నదీ చూపించాం. సెప్టెంబర్ 6న ఆడియన్స్ ముందుకొస్తున్నాం అన్నారు. హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ -తమిళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. మనసుకు నచ్చిన సినిమా. తెలుగు ట్రైలర్ చూసి ఎగ్జైట్ అయ్యాను. తారామణి రిలీజ్ కావడం హ్యాపీ. నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్, డిఎస్ రావు, పద్మిని తదితరులు మాట్లాడుతూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.